ఆలయ అభివృద్ధికి ఎస్ఐ విరాళం..

నవతెలంగాణ -భిక్కనూర్
మండలంలోని తిప్పాపూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి మండలంలో ఎస్సైగా విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న ఆనంద్ గౌడ్ 10,116 రూపాయల విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ సిద్ధ రాములు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ స్వామి, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు సాయి రెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ నర్సారెడ్డి, నాయకులు అంజా గౌడ్, ప్రభాకర్, నర్సారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.