ఎస్‌ఐ తుది రాత పరీక్ష ప్రిలిమ్స్‌ కీ విడుదల

నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
ఎస్‌ఐ పరీక్షకు జరిగిన తుది రాత పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ కీని రాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మెన్‌ వీవీ శ్రీనివాసరావు బుధవారం విడుదల చేశారు. అభ్యర్థులు తమ అధికారిక వెబ్‌ సైట్‌లో ఈ కీని చూడొచ్చని ఆయన తెలిపారు. ఎస్‌ఐ తత్సమాన పోస్టులకు జరిగిన వివిధ పరీక్షలకు సంబంధించిన కీని విడుదల చేసినట్టు ఆయన తెలిపారు. 11వ తేదీ గురువారం నుంచి ఈ కీని చూడొచ్చని చెప్పారు. అలాగే ఈ కీకి సంబంధించి ఏదేని అభ్యర్థులకు అభ్యంతరాలున్న పక్షంలో వాటికి కచ్చితమైన ఆధారాలను సైట్‌లో అందుకు సంబంధించి కేటాయించిన భాగంలో క్రోడీకరించి తమ అభ్యంతరానుల తెలియచేయాలని ఆయన సూచించారు. ఈ ప్రక్రియ అనంతరం ఫైనల్‌ కీని విడుదల చేస్తామన్నారు.