రెంజల్ మండలం పోలీస్ స్టేషన్ ఎదుట శనివారం రోడ్డుపై వెళ్లే వాహనాలను ఎస్సై ఈ సాయన్న ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, వాహనాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని, మైనర్ బాలురలకు బైకులు ఇవ్వరాదని ఆయన వాహనదారులను హెచ్చరించారు. శనివారం సాఠాపూర్ సంత కావడంతో వాహనదారులు ఎక్కువ సంఖ్యలో రావడం వల్ల వారిని తనిఖీ చేసి వారికి జరిమానాలు విధించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.