మండలంలోని లక్ష్మీపురం గ్రామంలోని ఆశ్రమ పాఠశాలలో వరద బాధితుల కోసం పునరవాస కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని పసర ఎస్ ఐ ఏ కమలాకర్ తెలిపారు. ఆదివారం మండలంలో గత 4 రోజుల నుండి కురుస్తున్న వర్షాన్నీ దృష్టిలో ఉంచుకుని స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాలను ఎస్సై కమలాకర్ సిబ్బందితో సందర్శించడం జరిగింది. గత అనుభవాల దృశ్య వరద తాకిడిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది.ఈ క్రమంలోలక్ష్మిపురం గ్రామం లోని ఆశ్రమ పాఠశాల లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేయడమైనదని ప్రజలకు తెలియచేసారు. లక్ష్మిపురం చుట్టూ ప్రక్కల గ్రామాల్లో ఇల్లు కూలిపోవటానికి అవకాశం ఉన్నవారు, ముంపు ప్రాంతాల వారు తాము ఉంటున్న ప్రాంతాలను వదిలి ఈ పునరావాస కేంద్రంలో ఉండాలని సూచించారు. అంతే కాకుండా ప్రజలు అందరూ తుఫాన్ తగ్గేంత వరకు అప్రమత్తంగా ఉండాలని ఏదైనా ప్రమాదం అనిపిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని చెప్పటం జరిగింది.