సీసీ కెమెరాల వల్ల ఎన్నో ఉపయోగాలు: ఎస్ఐ పరశురాం..

Many uses of CC cameras: SI Parasuram..నవతెలంగాణ – తొగుట
అసాంఘిక, అనైతిక కార్యక్రమాలకు నిరోధించేందు కు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని మిరుదొడ్డి ఎస్సై పరశురాములు అన్నారు. బుధ వారం మండలంలోని గుడి కందుల ఉన్నత పాఠ శాలలో ఎన్ఫోర్స్మెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అంబిగల్ల సాయి ప్రసాద్ అందించిన 4 సీసీ కెమెరాలను ప్రారంబించారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ.. పాఠశాల ఆవరణలో ఎలాంటి అసాంఘిక, అనైతిక కార్యక్రమాలకు పాల్పడ్డా వాటిని నిరోధించేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. పాఠశాలలో పూల, క్రోటన్ మొక్కలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయని కొనియాడారు. విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి మొక్కలను నాటారు. ఎస్సై పరశురాం, తొగుట మండల విద్యాధికారి వడ్లకొండ నరసయ్య దాత సాయి ప్రసాదును శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమములో పాఠశాల ప్రధానోపా ధ్యాయులు పరపాటకం అంజిరెడ్డి, ఉపాధ్యాయులు సోమ గారి నాగిరెడ్డి, వేణుమాధవ్, హనుమా రెడ్డి, కనక రాములు ,రవీందర్ రెడ్డి, శివయ్య, భాస్కర్ రెడ్డి, పర్వేజ్, బండారి లావణ్య, అనసూ య సిఆర్పి వెంకటస్వామి, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.