పీడీఎఫ్ బియ్యాన్ని పట్టుకున్న ఎస్ఐ రవి

నవతెలంగాణ – శంకరపట్నం
శంకరపట్నం మండల పరిధిలోని  మొలంగూర్ ఎక్స్ రోడ్ వద్ద శనివారం తెల్లవారు జామున స్థానిక ఎస్సై కొత్తపల్లి రవి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాలు చెక్ చేస్తుండగా టాటా ఎస్ ట్రాలీ ఏపీ 15 టి ఏ 1660 నెంబర్ గల వాహనాన్ని ఆపి చెక్ చేయగా అందులో రేషన్ బియ్యం వేసుకొని వస్తున్న డ్రైవర్ ప్రశ్నించగా తాడికల్ గ్రామానికి చెందిన నరాల అంకూస్ అని తెలిపారు.ప్రభుత్వం  పేదప్రజలకు ఇచ్చిన రేషన్ బియ్యాన్ని తాను తక్కువ ధరకు కొని నేను బ్లాక్ మార్కెట్లో ఎక్కువదరకు అమ్ముతానని తెలిపాడు అందులో (38) బస్తాలు సుమారుగా 19 క్వింటాల  బియ్యం అక్రమంగా తరలిస్తుంటే పట్టుకొని పంచుల సమక్షంలో పంచనామాచేసి అట్టి వాహనంను కేశవపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించి సుమోటో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.