బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ సందీప్ 

నవతెలంగాణ – రాయపర్తి 
రాయపర్తి పోలీస్‌ స్టేషన్‌ నూతన ఎస్ఐగా వడ్డె సందీప్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న దేశిని విజయ్ కుమార్ విఆర్ విభాగానికి బదిలీ కావడంతో హన్మకొండ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సందీప్ కుమార్ రాయపర్తి పోలీస్ స్టేషన్ ఎస్ఐగా బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఐ  సందీప్ కుమార్ మాట్లాడుతూ..మండల శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని, మండలంలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతే పోలీసుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. జూదం, అక్రమ మద్యం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. పోలీసు సిబ్బంది నూతన ఎస్ఐకి శుభాకాంక్షలు తెలిపారు.