విద్యుత్ తీగలు అమర్చి వన్యప్రాణులను చంపితే చర్యలు తప్పవు: ఎస్ ఐ షేక్ మస్తాన్

నవతెలంగాణ-గోవిందరావుపేట
విద్యుత్తు తీగలు అమర్చి వన్యప్రాణులను చంపితే చట్టరీత్యా చర్యలు తప్పవని పసర ఎస్ ఐ షేక్ మస్తాన్ అన్నారు. ఆదివారం కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా చల్వాయి మరియు బుస్సాపూర్ పంచాయతీ కార్యాలయలలో ప్రజలతో సమావేశాలు ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సమావేశం లో ఎస్ ఐ మస్తాన్ మాట్లాడుతూ వన్య ప్రాణులను  చంపాలని కొందరు కరెంట్ తీగలు , ఉచ్చులు అమరుస్తున్నారు సదరు ఈ విషయం తమ దృష్టి కి వచ్చిందని.. వీటి వాళ్ళ మనుషుల ప్రాణాలు పోయే  ప్రమాదం ఉందని , ముఖ్యంగా రైతులు పంట రక్షణ కొరకు కరెంట్ తీగలు పెట్టకూడదు అని , దీని కొరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని తెలియచేసారు.ఒకవేళ ఎవరైనా అలా చేస్తే చట్టరీత్య చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదేవిధంగా సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. అంతే కాకుండా సిసి కెమెరా ల ఏర్పాటు వాటి ఆవశ్యకత గురించి వివరిస్తూ ప్రజలందరూ భాగస్వామ్యం గా వారి వారి గ్రామం లో కెమెరా లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కెమెరాల ఏర్పాటు వల్ల గ్రామీణ ప్రాంతాల్లో నేరాల సంఖ్యను దొంగతనాలను తగ్గించవచ్చని అవగాహన కల్పించారు. కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ లు సింగం శ్రీలత, వీసం సమ్మయ్య లు మరియు ఇతర గ్రామ పెద్దలు పాల్గొన్నారు.