సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి, బ్యాంకు ఆధార్ కార్డు వివరాలు గుర్తు తెలియని వ్యక్తులకు చెప్పవద్దని సూచించారు. శుక్రవారం రాత్రి తొగుట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లారెడ్డిపేట గ్రామంలో పోలీసు కళాబృందం ప్రజలను చైతన్య పరిచే కను విప్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ వాట్సప్ కు వచ్చే మెసేజ్లు ఓపెన్ చేసి బ్లూ కలర్ వాటిపై క్లిక్ చేయవద్దని అన్నారు. అప్రమత్తంగా ఉంటే సైబర్ నేరం జరిగే అవకాశం ఉండదన్నారు. గుర్తు తెలియని వ్యక్తి తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో మాట్లాడితే వెంట నే ఫోన్ కట్ చేయాలని, ఆ నెంబర్ను బ్లాక్ చేయాల ని తెలిపారు. ఏదైనా సైబర్ నేరం జరిగితే టోల్ ఫ్రీ నెంబర్లు 1930 కాల్ చేయాలన్నారు. గంజాయి ఇతర మత్తు పదార్థాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. గ్రామాలలో పట్టణాలలో ఎవరైనా అనుమానాస్పదంగా కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి చట్టాన్ని చేతిలోకి తీసుకొని కొట్టడం లాంటి పనులు చేయ వద్దని అన్నారు. పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం సంఘవిద్రోహశక్తులపై పటిష్టమైన నిఘా ఏర్పాటు పేర్కొన్నారు. నకిలీ విత్తనాలపై రైతులు అప్రమత్తం గా ఉండాలని, విడి విత్తనాలు కొనవద్దని, విత్తనా లు కొనేటప్పుడు తప్పకుండా రసీదు తీసుకోవాల ని చెప్పారు. పోలీస్ కళా బృందం కనువిప్పు కార్య క్రమం ద్వారా మూఢనమ్మకాల పై, మద్యం తాగ డం వల్ల కలిగే నష్టాలు, కుటుంబ కలహాలు గురిం చి, పేకాట ఆడుట వలన కుటుంబలో జరుగుతు న్న పరిణామాలను, వరకట్నం వలన జరుగుతున్న సంఘటనలు, ఈమధ్య జరుగుతున్న ఆత్మహత్య ల గురించి వివరించారు. గ్రామంలో ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు ప్రజల దృష్టికి వస్తే వెంటనే డయల్ 100, లేదా సిద్దిపేట పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712667100 సమాచారం అందించాలన్నారు. వృద్ధులైన తల్లి దండ్రులను మంచి చూసుకోవాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్, షీ టీమ్స్ జరుగుతున్న సైబర్ నేరాల గురిం చి పాటల ద్వారా, సిడిల ద్వారా కళాబృందం సభ్యులు బాలు, రాజు, తిరుమల, తెలంగాణ సాంస్కృతిక సారథి బృందం సభ్యులు శ్యాంసుం దర్, కనకయ్య, బిక్షపతి, హరిప్రసాద్, ప్రకాష్, శైలజ పాటల, నాటకం రూపంలో ప్రజలను చైతన్య పరి చారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ప్రజా ప్రతి నిధులు, గ్రామ పెద్దలు, పోలీస్ సిబ్బంది తదితరు లు పాల్గొన్నారు.