– కొండపర్తి, జలగలంచ గుత్తి కోయగూడాల్లో పోలీసుల కార్డన్ సెర్చ్
నవతెలంగాణ – తాడ్వాయి
కొత్తవారు కనపడితే పోలీసులకు సమాచారం అందించాలని, తాడ్వాయి ఎస్సై ననిగంటి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. సోమవారం కాటాపూర్ క్రాస్ వద్ద వాహనాలను ఉమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. అనంతరం కొండపర్తి, జలగలంచ గుత్తి కోయగూడాల్లో విస్తృతంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వారి పూర్తి వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ అనుమానితులు కనబడిన, గ్రామాలలో కొత్తవారు వచ్చిన వెంటనే సమాచారం అందించాలని, మావోయిస్టు లకు సహకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మావోయిస్టులు కాలం చెల్లిన నిర్ణయాలతో ప్రజా జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నారని అన్నారు. సంఘవిద్రోహులకు సహకరిస్తే ఎంతటి వారినైనా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్, సిఆర్పిఎఫ్ పోలీసులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.