
– ప్రశాంత వాతావరణం లో పండుగలు, జాతరలు జరుపుకోవాలి
నవతెలంగాణ -పెద్దవూర
పెద్దవూర మండల ఎస్ఐ గా వీరబాబు సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన అజ్మీరా రమేశ్ నల్గొండ ట్రాఫిక్ ఎస్ఐ బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా ఎస్ఐ వీరబాబు మాట్లాడుతూ..శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు అందరూ సహకరించాలని కోరారు. పేకాట,జూదం,అక్రమంగా నడుస్తున్న బెల్టు షాపులు, అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతానన్నారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. కొత్త కేసులతో పాటు పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షించడం ద్వారా కేసుల సంఖ్య తగ్గించే దిశగా పని చేస్తున్నట్లు తెలిపారు.రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డు భద్రతపై అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.పీడీఎస్ బియ్యం అక్రమ నిల్వలను అరికట్టాలని, గంజాయి రవాణా, పేకాట,దొంగతనాల నివారణకు విస్తృత పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.శివరాత్రి ఉగాది, జాతరలు వంటి పండుగలను ప్రజలు శాంతి యుతంగా నిర్వహించు కోవాలన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్టింగ్ లు వ్యాఖ్యలు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు పోలీసు వారి సూచనలు పాటిస్తూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది వున్నారు.