
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం తిరుమలగిరి సాగర్ కీ చెందిన ఐతగోని శ్రవణ్ అను అతడు 14 నెలలు కింద పెద్దవూర మండలం లోని పులిచిర్ల గ్రామంలో వీఓసెల్ ను పోగొట్టుకున్నారు. దాదాపు 14 నెలలు అయినప్పటికీ ఆదివారం రోజు రోజునా శ్రవణ్ మొబైల్ ను సీఈఐఆర్ ద్వారా ట్రేస్ చేసి అతని ఫోన్ ను తిరిగి శ్రవణ్ కు అప్పగించారు. దీంతో 14 నెలల కింద పోయిన ఫోన్ ను మళ్ళీ పోగొట్టుకున్న పిర్యాదు దారునికి అప్పగించడం తో శ్రవణ్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి ఎస్ఐ మాకు ఉండడం చాలా సంతోషం అని తెలిపారు.ఈ విషయం తెలుసుకున్న మండలం ప్రజలు మాకు ఇలాంటి ఎస్ఐ మా మండలానికి రావడం చాలా సంతోషంగా ఉందని ప్రజలు హర్షము వ్యక్తం చేస్తున్నారు.