నసురుల్లాబాద్ స్టేషన్ కు ఎస్ఐ కావలెను…

నవతెలంగాణ నసురుల్లాబాద్ 
నసురుల్లాబాద్ పోలీస్ స్టేషన్‌కు గత నెలనుంచి ఎస్ఐ  లేకపోవడంతో ప్రజలు పలు రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు.  గతంలో ఇదే పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించిన ఎస్సై లావణ్య దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో ఇన్ ఛార్జ్ గా ఏఎస్ఐ విధులు నిర్వహిస్తున్నారు. పోలీస్ స్టేషన్‌కు ఎస్సై లేకపోవడంతో ఇన్ ఛార్జ్ ఏఎస్ఐ ఇతర సిబ్బంది నెరం సమాచారం తెలిసినను లిఖిత పూర్వకంగా పిర్యాదు వచ్చే వరకు సరైన చర్యలు తీసుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. స్టేషన్ పరిధిలో కనిష్ట స్థాయిలో కూడ తమ బాధ్యతలు నిర్వహించకుడా ప్రతి చిన్న విషయంలో పై అధికారులు అదేశిస్తెనే చర్యలు తీసుకుంటామని సమాధానం ఇస్తున్నట్లు సమాచారం. నసురుల్లాబాద్ పోలీస్ స్టేషన్ బోధన్ నిజామాబాద్, బాన్సువాడ కు రహదారి మధ్యలో ఉండడంతో తరచు ప్రమాదాలు, చిన్న చిన్న తగాదాలు తరచు జరుగుతున్నాయి. స్టేషన్ కు బాధ్యత గల అధికారి లేక పోవడంతో బాధితులకు తక్షణ న్యాయం జరగడం లేదు. ఇప్పటికైనా పై అధికారులు స్పందించి ఎస్ఐ నియమించాలని మండల ప్రజలు కోరుచున్నారు.