పెద్ద కొడప్ గల్ మండలంలోని చావని తండాకు చెందిన బస్సి మధుసింగ్ కుటుంబానికి ఎస్ఐ మహేందర్ ఆర్థిక సహాయం చేశారు. వివరాలకై బస్సి మధుసింగ్ గత నెలలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న సందర్భంగా అడవి పంది అడ్డురావడంతో ద్విచక్రవాహనం అదుపు తప్పి పడిపోవడంతో మెరుగైన చికిత్స కోసం నిమ్స్ కు తరలించిన ఫలితం లేకుండపోవడంతో ఇంటికి తీసుకొనిరాగ మంగళవారం నాడు మరణించారు. గురువారం రోజున ఉదయం సమయంలో బస్సి మధుసింగ్ తండ్రి మరణించిన విషయం తెలుసుకున్న ఎస్ఐ మహేందర్ చావని తండాకు వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి 5 వేల రూపాయలు ఆర్ధిక సహాయం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో మాట్లాడుతూ మధుసింగ్ కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యంగా ఉండాలని మధు సింగ్ ఇద్దరు పిల్లలకు చదువు కొరకు ఉన్నత అధికారులతో మాట్లాడి వసతి గృహంలో చేర్చే విదంగా కృషి చేస్తూ వారికి అయ్యే ఖర్చులను భరిస్తానాని అన్నారు.ద్విచక్ర వాహనం పై ప్రయాణం చేసే సమయంలో ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని సూచించారు. ఒక వేల మధుసింగ్ హెల్మెట్ వాడి ఉంటే ఈ రోజు కుటుంబ సభ్యులకు ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆయన తెలిపారు. ద్విచక్ర వాహనం పై నుండి పడి గాయపడ్డా బ్రతికి బయటే పడే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. ముఖ్యంగా యువత హెల్మెట్ ధరించి జాగ్రత్తగా వాహనాలు నడిపి ఇంటికి క్షేమంగా చేరుకోని కుటుంబ సభ్యులకు సంతోషంగా ఉంచాలని కోరారు.ఒక వేళ యువత అజాగ్రత్తగా వాహనాలు నడిపి ప్రమాదాలకు గురై మరిణిస్తే వారి కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటాదో ఒక్క సారి యువత ఆలోచించలని గ్రామస్థులకు ఆయన మాట్లాడుతూ అన్నారు.