గంజాయి మాదకద్రవ్యాల ప విద్యార్థులకు అవగాహన: ఎస్ఐఏ కమలాకర్

నవతెలంగాణ – గోవిందరావుపేట
గంజాయి తదితర మాదగద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన అవసరమని పసర ఎస్ ఐ ఏ కమలాకర్ రావు అన్నారు. బుధవారం మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల విద్యార్థులకు గంజాయి మాదకద్రవ్యాల పై అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు గంజాయి మాదక ద్రవ్యాలకు ఆకర్షితులు కావొద్దు అని.. వాటికి ఆకర్షితులు అయి జీవితాలు నాశనం  చేసుకోవొద్దు అని చెప్పారు. అంతేకాకుండా విద్యార్థులు చదువు పై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను పెట్టుకుని జీవితం లో ఉన్నత స్థానానికి ఎదగాలని సూచించారు.ఎటువంటి చెడు అలవాట్లు లేకుండా తమ తల్లీ తండ్రులకు, గురువులకు  మంచి పేరు తీసుకురావాలని తెలియచేసారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కల్తీ శ్రీనివాస్ వ్యాయామ ఉపాధ్యాయులు ఆదినారాయణ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.