కల్కి 2898 ఏడీతో సియాట్‌ భాగస్వామ్యం

హైదరాబాద్‌ : ప్రభాస్‌ నటించిన కల్కి 2898 ఏడీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు ప్రముఖ టైర్ల కంపెనీ సియాట్‌ స్పెషాలిటీ ప్రకటించింది. ఏఐ వాహనం కోసం ఫ్యూచరిస్టిక్‌ టైర్ల ఆవిష్కరణకు ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్టు పేర్కొంది. సినిమాలో కనిపించే రోబోటిక్‌ వాహనం ‘ బుజ్జి’ కోసం అత్యాధునిక టైర్లను అభివృద్థి చేయడానికి, ఆవిష్కరించడానికి ఆ చిత్రంతో భాగస్వామ్యం చేసుకున్నట్టు తెలిపింది. ఇది తమ అత్యాధునిక సాంకేతికతకు నిదర్శనమని.. మొబిలిటీ భవిష్యత్తును ముందుకు నడపడానికి దోహదం చేయనుందని సియాట్‌ స్పెషాలిటీ ఆర్‌అండ్‌డీ హెడ్‌ ద్యుతిమాన్‌ ఛటర్జీ తెలిపారు. ఈ ప్రాజెక్టు తమ ప్రమాణాలను మరింత పెంచనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.