
అదే సమయంలో ప్రత్యేకమైన ఆఫర్లు కూడా అందజేస్తామన్నారు. అందరికీ స్వచ్ఛమైన, సురక్షితమైన, ఆరోగ్యకరమైన తాగు నీటిని అందించే లక్ష్యంతో ఉన్నామన్నారు. డ్రింక్‌ప్రైమ్ వేగవంతమైన వృద్ధి కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా డ్రింక్‌ప్రైమ్ సహ వ్యవస్థాపకుడు, సీవోవో మనస్ రంజన్ హోటా మాట్లాడుతూ ఈ వ్యూహాత్మక పెట్టుబడి డ్రింక్‌ప్రైమ్‌కు విస్తరణ ప్రణాళికలను వేగవంతం చేయడానికి సహకరిస్తుందన్నారు. మా వినూత్న ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను అభివృద్ధి చేయడానికి ఇ్ఇ ఎంతగానో ఉపయోగపడనుందని తెలిపారు. ఈ సందర్భంగా పాలిక్యాబ్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ భరత్ జైసింఘని మాట్లాడుతూ దశాబ్దాలుగా స్తబ్దతగా ఉన్న పరిశ్రమలో మార్పును సృష్టించడం చూశానన్నారు. అందుకే డ్రింక్ ప్రైమ్‌లో నా పెట్టుబడిని రెట్టింపు చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. డ్రింక్‌ప్రైమ్ ప్రస్తుతం భారతదేశంలోని ఏడు నగరాల్లోని 2 లక్షల+ కుటుంబాలకు స్వచ్ఛమైన, సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన తాగునీటిని అందిస్తోంది. అందరికీ సురక్షితమైన త్రాగునీటిని అందుబాటులోకి తీసుకురావాలనే దాని మిషన్‌కు దగ్గరగా వెళ్లడానికి విస్తరణ ప్రణాళికలతో, డ్రింక్‌ప్రైమ్ తన సిరీస్ B నిధుల సేకరణ కోసం సిద్ధమవుతోంది.