
సుప్రసిద్ధ దేవస్థానం సిద్దుల గుట్ట నందు నిర్మిస్తున్న”” శ్రీ నవనాథ సిద్దేశ్వర పిరమిడ్ ధ్యానమహా శక్తి క్షేత్రం “” స్ట్రక్చర్ నిర్మాణంలో భాగంగా అవసరమయ్యే షీట్స్ కొరకు 6,28,000 /- (ఆరు లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయల) విరాళాన్ని అంకాపూర్ గ్రామానికి చెందిన శ్రీ మతి కూనింటి గంగారెడ్డి గంగుబాయి దంపతులు బుధవారం అందజేసినారు. నవనాథ సిద్దేశ్వర పిరమిడ్ ధ్యాన మహా శక్తి క్షేత్రం అధ్యక్షులు తిరుమల గంగారం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు శ్రీ నల్ల గంగారెడ్డి చెక్కును అందించారు. ఈ కార్యక్రమం లో నవనాథపురం కమిటీ సభ్యులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి, కూనింటి శేఖర్ రెడ్డి , పెంబర్తి నారాయణ, నరసయ్య, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.