పర్యటక కేంద్రంగా సిద్ధ రామేశ్వర ఆలయం

నవతెలంగాణ- భిక్కనూర్
మండల కేంద్రంలో ఉన్న సిద్ధ రామేశ్వర ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ తెలిపారు. సోమవారం కుటుంబ సమేతంగా సిద్ధరామేశ్వర ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద పునరుద్ధరిస్తున్న కోనేరును పరిశీలించి కోనేరు నిర్మాణ పనులను దిరైన్ వాటర్ ప్రాజెక్టు వ్యవస్థాపకురాలు కల్పనా రమేష్, ప్రముఖ ఆర్కియాలజిస్ట్ పూర్తి వివరాలను కలెక్టర్ కు తెలియజేశారు. తమిళనాడుకు చెందిన పలువురు దాతలు ఆలయ అభివృద్ధికి విరాళాలుగా అందచేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ అనంతరావు, ఆలయ పునర్నిర్మాణ కమిటీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, ఆలయ కార్యనిర్వాన అధికారి శ్రీధర్, ఆలయ పూజారులు సిద్ధగిరి శర్మ, రామగిరి శర్మ, రాజేశ్వర శర్మ ఉన్నారు.