ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదలైన ‘సప్త సాగరాలు దాటి సైడ్ ఎ’ విశేష ఆదరణ పొందింది. దీంతో ‘సప్త సాగరాలు దాటి సైడ్ బి’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి. విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 17న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర ట్రైలర్‌ను అగ్ర కథానాయిక సమంత లాంచ్ చేశారు.
తెలుగులో ‘సైడ్ ఎ’ ఘన విజయం సాధించినట్లుగానే, ‘సైడ్ బి’ కూడా తెలుగు ప్రేక్షకుల హదయాలను కొల్లగొట్టడం ఖాయమని చిత్ర బందం నమ్మకంగా ఉంది. హేమంత్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్, చైత్ర జె. ఆచార్ ప్రధాన పాత్రలలో నటించారు.