స్మోక్డ్ క్యాన్డ్ ఆహారాలు అనేవి ఆధునిక జీవన శైలిలో సాధారణమైనవిగా మారాయి. శీతాకాలం, మాన్సూన్ కాలంలో వీధి పక్కన వేడివేడిగా స్నాక్స్ తినడం ప్రత్యేకంగా మారాయి. వీటిలోని అధిక ప్రాసెసింగ్, రసాయన పదార్థాలు ఆరోగ్యంపై వ్యతిరేక ప్రభావాలను చూపుతున్నాయి. మారుతున్న జీవనశైలి, వేడివేడిగా మారే ఆహారపు అలవాట్లు, తాజా ఆహారం అందుబాటులో లేకపోవడంతో ఈ ఆహారాలను తరచుగా తీసుకోవడం వల్ల సమాజంలో అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
ఆధునిక జీవనశైలిలో స్మోక్డ్, క్యాన్డ్ ఆహారాల వినియోగం ఎక్కువైపోయింది. స్మోక్డ్, క్యాన్డ్ ఆహారాలు ఆరోగ్యంపై వివిధ రకాల ప్రభావాలు చూపుతాయి.
ఇక్కడ స్మోక్డ్, క్యాన్డ్ ఆహారాల ఆరోగ్య ముప్పును, వాటి ప్రభావాలను తగ్గించుకునే మార్గాలను చర్చిద్దాం.
స్మోక్డ్ ఫుడ్ (Smoked Foods):: గ్రిల్డ్ ఫిష్, గ్రీల్డ్ చికెన్, షావర్మ, బార్బెక్యూ చికెన్, గ్రిల్డ్ పోర్క్‌స్మోక్డ్, హామ్ వంటి కాల్చిన మాంసం, పన్నీర్, కూరగాయలు, చేపలకు సంబంధించిన ఆహారాలు పొగతో ప్రాసెస్ చేయబడతాయి. అయితే, పొగ వల్ల ఏర్పడే పాలిసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (PAHs),, నైట్రోసామైన్స్ వంటి రసాయనాలు క్యాన్సర్‌తో సహా అనేక దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తాయి. అంతేకాకుండా, ఇది గుండె జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులు, జీర్ణ సంబంధిత సమస్యలకు కారణమవుతుంది.
స్మోక్డ్ చేసే ప్రక్రియలో ఆహారంలో పలు రకాల రసాయనాలు, ముఖ్యంగా పాలీసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్లు (PAHs),, హెటరోసైక్లిక్ అమీన్లు (HCAs) అనేక ఆరోగ్య సమస్యలకు కారణం కావొచ్చు.
1. క్యాన్సర్ ప్రమాదం
స్మోక్డ్ చేసిన మాంసాహారం లేదా ఇతర ఆహారాలు ఇన్‌ఫ్లమేషన్‌ని కలిగిస్తాయి. వీటిని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల క్యాన్సర్, ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలకు, పెద్దప్రేగుకు క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది.
2. గుండె సంబంధిత సమస్యలు
అధిక స్మోక్డ్ ఫుడ్ తీసుకోవడంతో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగవచ్చు. ఇది గుండె జబ్బులు, రక్తనాళాల బ్లాకేజీ వంటి సమస్యలకు దారితీస్తుంది.
3. శ్వాస సంబంధిత సమస్యలు
స్మోక్డ్ ఫుడ్ కారణంగా శ్వాసకోశ వ్యాధులు, ప్రధానంగా ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి సమస్యలు ఎక్కువవుతాయి.
4. గ్యాస్ట్రిక్ సమస్యలు
స్మోక్డ్ ఆహారం మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్ ట్రబుల్ వంటి సమస్యలకు కారణమవుతుంది.
క్యాన్డ్ ఫుడ్ (జ(Canned Foods):: క్యాన్డ్ చేసిన ఆహారాలు అనగా పండ్లు, పచ్చళ్ళు, సూప్‌లు, ట్యూనా ఫిష్, బేక్డ్ బీన్స్, మొక్కజొన్న, పచ్చి బటాణీలు, గ్రీన్ బీన్స్, టమోటాలు, క్యాన్డ్ ట్యూనా, సాల్మన్, సార్డీన్స్, చికెన్, కార్న్‌డ్ శీతల పానీయాలు. బిజీ జీవనశైలి కారణంగా తక్షణమే ఉపయోగించదగిన క్యాన్ ఆహారాలకు డిమాండ్ పెరుగుతుంది. ఈ విధానం ఆహారాన్ని, కూరగాయలను రసాయనికంగా నిల్వ చేయడానికి ఉపయోగపడుతుంది.
డబ్బా ఆహారాలు సులభంగా అందుబాటులో ఉంటాయి. కానీ వీటిలో సోడియం, బిస్ఫినోల్ A (BPA) వంటి రసాయనాలు అధికంగా ఉంటాయి. సోడియం అధికంగా ఉండడం వల్ల రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు ఉత్పన్నమవుతాయి. BPA వంటి రసాయనాలు హార్మోన్ల అసమతుల్యతకు, క్యాన్సర్, ప్రసవించే సమయంలో ఇబ్బందుల వంటి సమస్యలకు దారితీస్తాయి. ప్రిజర్వేటివ్స్ ఉండటం వల్ల రోగనిరోధక శక్తి తగ్గడం, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.
బిస్ఫినోల్ – A (BPA) అనే రసాయనం హార్మోన్ల అసమతుల్యత, మధుమేహం, జీవక్రియ సమస్యలు, పునరుత్పత్తి సమస్యలు వంటి అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది.
ఆరోగ్య సమస్యలు:
– జీవక్రియ సంబంధించిన సమస్యలు
– నాడీ సంబంధిత సమస్యలు
– హార్మోన్ల అసమతుల్యత
– రోగనిరోధక శక్తి తగ్గుదల
– అధిక రక్తపోటు
– గుండెపోటు
– కిడ్నీ సంబంధిత సమస్యలు
టిన్ డబ్బాలతో సమస్యలు
డబ్బాల్లో ఉపయోగించే టిన్ ఎక్కువకాలం నిల్వ ఉంటే ఆహారంలో కలిసే అవకాశాలు ఉంటాయి. ఈ టిన్ పొత్తికడుపు సమస్యలు, చర్మం, శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడం, గౌట్, కిడ్నీలో రాళ్ళు ఏర్పడడం, ఆర్థరైటిస్ వంటి సమస్యలు, కొంతమందికి నాడీ వ్యవస్థ సమస్యలు కలిగించవచ్చు.
బిస్ఫినోల్ – A (BPA) ప్రభావం
BPA అంటే అల్యూమినియం, టిన్ డబ్బాల్లోని ఒక రసాయనం. ఇది శరీరంలో హార్మోన్ల అసమతుల్యతకు, గుండె వ్యాధులు, మధుమేహం, క్యాన్సర్, అధిక బరువు వంటి సమస్యలకు దారితీస్తుంది.
బోటులిజం ప్రమాదం
తగిన రీతిలో డబ్బాలో నిల్వ చేయని ఆహారం క్లోస్ట్రిడియం బొటులినం అనే బ్యాక్టీరియాకు కారణమవుతుంది. ఇది బోటులిజం అనే తీవ్రమైన వ్యాధిని కలిగించవచ్చు.
ఆరోగ్య సమస్యలు:
క్యాన్సర్: BPA ఉన్న డబ్బా ఆహారాలు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.
గుండె జబ్బులు: అధిక సోడియం వల్ల రక్తపోటు పెరిగి గుండె జబ్బులు వస్తాయి.
మధుమేహం: అధిక ప్రాసెసింగ్ ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తాయి.
అలర్జీలు, హార్మోనల్ సమస్యలు: BPA వంటి రసాయనాలు ఇమ్యూన్ సిస్టమ్‌ని దెబ్బతీస్తాయి.
ఆరోగ్య మార్గదర్శకాలు:
స్మోక్డ్, క్యాన్డ్ ఆహారాలు తినడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నవారు ఈ మార్గదర్శకాలను పాటించవచ్చు.
ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవడానికి స్మోక్డ్, డబ్బా ఆహారాలు తగ్గించి, నేచురల్, తాజా ఆహారాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. కింది మార్గదర్శకాలు ఈ మార్పులో తోడ్పడుతాయి.
యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహార ఆరోగ్య ప్రయోజనాలు :
– యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించడంలో సహాయపడతాయి, ఇవి ఫ్రీ రాడికల్స్ అనే హానికరమైన అణువులను తటస్థపరుస్తాయి. తద్వారా కణాలకు రక్షణ అందిస్తాయి
– ఆకుకూరగాయలు, సలాడ్ మన ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. ఇవి పోషకాల సమద్ధిగా ఉండే ఆహారాలుగా పరిగణించబడుతాయి.
– ఆకుకూరగాయలు, పచ్చి కూరగాయలు శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ను తొలగించి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
– క్యాన్సర్ ముప్పును తగ్గించడం, మధుమేహ నియంత్రణ, చర్మ ఆరోగ్యం, న్యూరోలాజికల్ వ్యాధుల నివారణ, రోగనిరోధక శక్తి పెంపు వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
– రోజువారీ ఆహారంలో ఈ ఆహారాలను చేర్చడం ద్వారా మెరుగైన ఆరోగ్యం సాధించవచ్చు.
పీచు అధికంగా ఉండే ఆహారం, ఆరోగ్య ప్రయోజనాలు
ఆకుకూరగాయలు, పై తొక్కతో ఉన్న పండ్ల సలాడ్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. బరువు నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే ఇవి తక్కువ కేలరీలను కలిగివుంటాయి
ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి మధుమేహ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ద్రవ్యరూప ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ప్రొస్టేట్, పెద్ద ప్రేగు కేన్సర్ రిస్క్‌ను తగ్గించడంలో ఫైబర్ సహాయపడుతుంది. రెగ్యులర్‌గా ఫైబర్ తీసుకుంటే బిపి స్థాయిలను సమతుల్యం చేస్తుంది
నాచురల్ ప్రోబయోటిక్ ఆహారాలు
ప్రోబయోటిక్స్ శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచే సజీవ సూక్ష్మజీవులు. ఇవి జీర్ణ వ్యవస్థలో ‘సత్కారక బ్యాక్టీరియా’ లాగా పనిచేస్తాయి. శరీరానికి వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి.
ప్రోబయోటిక్స్ ఆరోగ్య ప్రయోజనాలు:
– ప్రోబయోటిక్స్ గ్యాస్, మలబద్ధకం, పెద్ద ప్రేగు కేన్సర్ రిస్క్‌ను, జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహకరిస్తాయి.
– శరీర రోగనిరోధక శక్తిని బలపరుస్తూ ఇన్‌ఫెక్షన్లను నివారిస్తాయి.
– జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు, మానసిక ఆరోగ్యానికి కూడా ప్రోబయోటిక్స్ దోహదపడతాయి.
సమతుల ఆహారం
రోజుకు కనీసం 3-4 రకాల కూరగాయలు, 2-3 రకాల పండ్లు తీసుకోవడం మంచి ఆహార అలవాట్లు.
పోషకాహారం: ప్రతి భోజనంలో ప్రొటీన్లు (కాయ ధాన్యాలు, పెరుగు, గుడ్లు), కార్బోహైడ్రేట్లు (బ్రౌన్ రైస్, గోధుమలు), కొవ్వులు (తేనె గింజలు, నువ్వులు) ఉండేలా చూసుకోవాలి. బాలన్స్డ్ డైట్ ద్వారా శరీరానికి అన్ని రకాల పోషకాలు అందుతాయి.
ఖనిజాలు :
క్యాల్షియం, పొటాషియం, మ్యాగ్నీషియం లాంటి ఖనిజాలు రక్తపోటు నియంత్రణలో సహాయపడతాయి.
హైడ్రేషన్
పానీయాలు: ప్రతి రోజు 8-10 గ్లాసుల నీరు తాగడం ద్వారా శరీరంలో తేమ నిల్వ ఉంటుంది. గ్రీన్ టీ, లెమన్ వాటర్ వంటి ఆరోగ్యకరమైన పానీయాలు మంచి ప్రత్యామ్నాయాలు.
స్మోక్డ్, క్యాన్డ్ చేసిన ఆహారాలు నివారించడం:
స్మోక్డ్, ఆహారాలకు బదులుగా ఉడకబెట్టిన, తాజా ఆహారం తీసుకోవడం శ్రేయస్కరం.
BPA రహిత ప్యాకేజింగ్ డబ్బా ఆహారాన్ని కాలపరిమితికి ముందే వినియోగించాలి
డబ్బా తెరిచిన తర్వాత ఆహారాన్ని ఇతర పాత్రలోకి మార్చి నిల్వ చేయడం మంచిది.
గాజు సీసాలు, BPA- రహిత డబ్బాలో ఉన్న ఆహారాలను ఎంపిక చేసుకోవాలి.
ప్రతిరోజూ తాజా కూరగాయలు, పండ్లు, తగినంత నీరు, గ్రీన్ టీ వంటి ఆరోగ్యకరమైన పానీయాలు తీసుకుంటూ, క్యాన్డ్ ఆహారాల వినియోగాన్ని తగ్గించాలి. ప్రకతిసిద్ధమైన ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి.
మార్గదర్శకాలు పాటించడమే ఆరోగ్యంగా ఉండటానికి మొదటి మెట్టు. చిన్న చిన్న అలవాట్ల మార్పులు సమగ్ర ఆరోగ్యానికి పునాది.
Dr.Prathusha. Nerella
MD( General Medicine) CCEBDM; CCGDM; NLP; FID
Senior General Physician, Positive Psychologist certified Nutritionist, Diabetes And Lifestyle Expert, Pranic Healer Chiief Holistic Health Consultant And Medical Director @ Praveha General, Diabetes And Lifestyle Clinic – A Holistic Centre With Integrated Approach. Ph: 8897684912/040-49950314