బెంగళూరు : ప్రీమియం డెయిరీ బ్రాండ్ అయిన సిద్స్ ఫార్మ్ తాజాగా యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఆసియా అండ్ పసిఫిక్ (ఎస్కాప్)కు చెందిన ఇన్‌క్లూజివ్ బిజినెస్ ప్రోగ్రాంలో పాల్గొనడానికి ఎంపికైనట్లు తెలిపింది. ఇందుకోసం ఎకోసియేట్ ఎండెవా (కోచ్)తో అవగాహన ఒప్పందం కుదిరినట్లు పేర్కొంది. ఇన్‌క్లూజివ్ బిజినెస్ ప్రోగ్రాం కింద ”చిన్న కమతాల డెయిరీ రైతుల పాల ఉత్పాదకతను వార్షికంగా 1.2 రెట్లు మెరుగుపరచడం” పేరుతో ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నట్లు పేర్కొంది. ఈ అవకాశం లభించడం తమకు ఎంతో గౌరవమని సిద్స్ ఫార్మ్ వ్యవస్థాపకుడు కిషోర్ ఇందుకూరి పేర్కొన్నారు.