మెరుగైన కస్టమర్ అనుభవం కోసం హైదరాబాద్‌లో అప్‌గ్రేడ్ చేసిన యాప్‌ను ఆవిష్కరించిన సిద్స్ ఫార్మ్

– ఇంటి వద్ద నే సహజమైన & కల్తీ లేని పాలు మరియు పాల ఉత్పత్తుల ఆన్‌లైన్ డెలివరీ
హైదరాబాద్: తెలంగాణలోని ప్రీమియం డెయిరీ బ్రాండ్ అయిన సిద్స్ ఫార్మ్, హైదరాబాద్‌లోని తమ కస్టమర్ల కోసం తమ మొబైల్ అప్లికేషన్ యొక్క మెరుగైన వెర్షన్‌ను ఆవిష్కరించినట్లు వెల్లడించింది. ఈ కొత్త వెర్షన్ డౌన్‌లోడ్/అప్‌డేట్ కోసం సెప్టెంబర్ 21 నుండి ఆండ్రాయిడ్ మరియు iOS ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంటుంది. అప్‌డేట్ చేయబడిన యాప్ కస్టమర్‌ల కోసం ఆర్డరింగ్ ప్రక్రియను సులభతరం చేసే లక్ష్యంతో కొత్త ఫీచర్‌ల శ్రేణిని పరిచయం చేస్తుంది.  కస్టమర్‌లు రాత్రి 10 గంటలలోపు తమ ఆర్డర్‌లను ఉంచవచ్చు లేదా సవరించవచ్చు మరియు మరుసటి రోజు ఉదయం వారి ఇంటి వద్దే స్వచ్ఛమైన , సహజమైన పాలు & పాల ఉత్పత్తులను పొందవచ్చు.  సిద్స్ ఫార్మ్ వ్యవస్థాపకుడు డాక్టర్ కిషోర్ ఇందుకూరి మాట్లాడుతూ , “గత రెండేళ్లుగా హైదరాబాద్‌లోని మా కస్టమర్‌ల నుండి వచ్చిన అద్భుతమైన స్పందన, యాప్ పనితీరు మరియు వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడానికి మమ్మల్ని ప్రోత్సహించింది. అప్‌గ్రేడ్ చేసిన యాప్ ఆర్డరింగ్ ప్రక్రియను సులభతరం చేయటంతో పాటుగా మా కస్టమర్‌లకు అసమానమైన సౌకర్యాన్ని అందించడానికి కొత్త ఫీచర్‌లను కలిగివుంది. ఈ తాజా వెర్షన్‌తో మా లక్ష్యం  మా కస్టమర్ల ఇంటి వద్దకే కల్తీ లేని పాలు మరియు పాల ఉత్పత్తుల డెలివరీలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం తో పాటుగా మహోన్నత వినియోగదారు అనుభవాలను అందించటం” అని అన్నారు.