నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు, విజిలెన్స్ సిఐ ఆధ్వర్యంలో మంగళవారం పలు ప్రాంతాలలో తనిఖీలు చేపట్టారు. కాగా జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో గల సువర్ణ క్యాటరింగ్ షాప్ పై ఆకస్మిక తనిఖీ చేయగా 8 గృహ అవసరాల కోసం వినియోగించే సిలిండర్లు లభ్యమయ్యాయి. వాటిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. షాపు యజమానిపై 6ఎ కేసును నమోదు చేశారు. ఈ తనిఖీలో నల్లగొండ డిటిసిఎస్ దీపక్, సివిల్ సప్లై ఆర్ఐ లింగస్వామి, విజిలెన్స్ ఎస్ఐ గౌస్, తదితరులు పాల్గొన్నారు.