
మండలంలోని చీన్నాపూర్ గ్రామంలోని తీర్మన్ చెరువు కబ్జాకు గురి కావడంతో నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్ర కుమార్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా చిన్నాపూర్ గ్రామంలోని తీర్మాన్ చెరువు కబ్జాకు గురై, పట్టా కూడా చేసుకున్నారని గ్రామస్థులు తహశీల్దార్ కార్యాలయం ముందు గత నాలుగు రోజుల క్రితం ధర్నా నిర్వహించారు. సోమవారం సంఘటన స్థలానికి వచ్చి పరిశీలిస్తామని గ్రామస్థులకు తహశీల్దార్ హామీ ఇవ్వడంతో సోమవారం ఆర్డీవో తో కలిసి పరిశీలించారు. 438/ఉ, 439 సర్వే శిఖం భూమి కబ్జాకు గురైంద లేదా అని పరిశీలించి, కబ్జాకు గురైనట్లైతే పట్టాను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ షబ్బీర్, అర్ ఐ షఫీ, సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.