మౌనం అర్ధాంగికారమే కాదు…

One thing
Two hands
One India
Do Pahechanమాట ఒకటి
చేతలు రెండు
ఏక్‌ భారత్‌
దో పహేచాన్‌

భారత్‌ సమ్మాన్‌ దేశ దేశములలో
మానం, మర్యాద అగ్ని గుండంలో

ఏమిటి…? ఈ దాష్టికం..? దౌర్జన్యం..?
అంటూ దేశమంతా గగ్గోలు
సమాధానం లేని సభాపర్వం

ఒకవైపు చంద్రయానాలు
ఇంకొక వైపు కమిలి, కుమిలి
పోయే ఊరేగింపులు

ఎటూ పొసగని
దో పహేచాన్‌

స్వచ్‌ భారత్‌ అంటే
శుభ్ర భారత్‌ అనుకున్న
మనుషులపై పోయటం అని అర్థం కాకపాయే

దేశ దేశాలు తిరిగి
భారత్‌ పహేచానో… భారత్‌ పహేచానో…
ఇప్పుడు భారత్‌ బత్తలయ్యింది
అన్న సంగతి తెలియక పాయే

వీటన్నిటికీ జవాబుదారీతనం
మౌనం… మౌనం…

మన్‌ కీ బాత్‌
చమన్‌ కీ బాత్‌ కాదు
పెదవి దాటని మౌనం
అన్నింటికి అర్ధాంగీకారమే కాదు
నిరంకుశాధికారం కూడా…
– వి. కె.