నవతెలంగాణ- తాడ్వాయి : వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుండి 24 వరకు జరుగు మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు త్రాగునీటిగాను జంపన్న వాగులోని మంచినీటి ఉటపావులలో పూడికతీత పనులు రెండు రోజుల నుండి ముమ్మరంగా సాగుతున్నాయి. బావుల్లో ఉన్న చెత్తాచెదారం మురికి నీరును మోటార్ల ద్వారా తొలగించుకుంటూ చెత్తాచెదారాన్ని తొలగిస్తున్నారు. ఆర్డబ్ల్యూఎస్ వెంకట సతీష్ దగ్గర ఉండి పూర్తిగా పనులను నిర్వహిస్తున్నారు. మూడు బావులు రెండు రోజులలో పూర్తికానునట్లు తర్వాత మళ్లీ మూడు బావులు ఉడక తీర్థ పనులు ప్రారంభించి ఇలా బావులన్నీ పూడికతీత పనులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఆర్డబ్ల్యూఎస్ ఏఈ నవీన్ ఉన్నారు.