పట్టు చీరల ఇస్త్రీ ఇలా

Like ironing silk sareesబట్టలు ఇస్త్రీ చేసుకునేటప్పుడు, ముఖ్యంగా పట్టు చీరల ఇస్త్రీలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. సాధారణ దుస్తుల మాదిరి వాటిని ఇస్త్రీ చేస్తే త్వరగా పాడైపోయే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో తెలుసుకుందాం.
– చీరలు కొనేటప్పుడే వాటిని ఇస్త్రీ చేయవచ్చో లేదో తెలుసుకోవాలి.
– ఇస్త్రీ చేసేటప్పుడు చీరపై కాటన్‌ వస్త్రం ఉంచి చేయాలి. ఇలా చేస్తే, వేడికి కాలిపోకుండా ఉంటాయి.
– ఐరన్‌ బాక్స్‌ మోడ్స్‌ని మార్చుకోకుండా ఇస్త్రీ చేయకూడదు. అలాగే ముందుగా చీర అంచులను ఇస్త్రీ చేయాలి. ఆ తర్వాతే చీర మధ్యలో చేయాలి. ఇలా చేస్తే ముడతలు చక్కగా పోతాయి.
– ఐరన్‌ చేయగానే వెంటనే మడతలు పెట్టకూడదు. హ్యాంగర్‌కు వేలాడదీయాలి. వెంటనే మడత పెడితే ముడతలు వచ్చేస్తాయి.