వేంకటేశ్వర స్వామి ఆలయానికి రూ.2.50 లక్షల వెండి బహుకరణ 

నవతెలంగాణ-మల్హర్ రావు : మండల కేంద్రమైన తాడిచెర్లలోని వేంకటేశ్వర స్వామి,అమ్మవార్ల  ఆలయానికి రూ.2.50 లక్షల విలువగల వెండి ఆభరణాలను వోల్లాల నవ్య సత్యనారాయణ దపతులు బహుకరించారు. అలాగే వేంకటేశ్వర ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల సందర్శకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.