రాజా రిత్విక్‌కు రజతం

Silver for Raja Ritwik– జాతీయ బ్లిట్జ్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో సత్తాచాటిన యువకెరటం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
జాతీయ బ్లిట్జ్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌-2024లో తెలంగాణ గ్రాండ్‌ మాస్టర్‌ రాజా రిత్విక్‌ రజత పతకాన్ని సాధించారు. మహారాష్ట్రలోని నాసిక్‌లో గురువారం ఈ పోటీలు జరిగాయి.
6వ సీడ్‌గా ఆడుతున్న రాజా రిత్విక్‌ అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన 224 మంది అగ్రశ్రేణి క్రీడాకారులు పాల్గొన్న ప్రతిష్టాత్మక నేషనల్‌ బ్లిట్జ్‌ టోర్నమెంట్‌లో, 11 రౌండ్లలో 9 పాయింట్లు సాధించి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. రిత్విక్‌ 7 గేమ్‌లు గెలిచి, 4 గేమ్‌లు డ్రా చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని కేఎల్‌ యూనివర్శిటీలో ఇంజినీరింగ్‌ చదువుతున్న రాజా రిత్విక్‌, రేస్‌ చెస్‌ అకాడమీలో ప్రముఖ కోచ్‌ ఎన్‌ రామరాజు ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్నారు.
ఈ జాతీయ బ్లిట్జ్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో పశ్చిమ బెంగాల్‌కు చెందిన జిఎం ఘోష్‌ దీప్తాయన్‌ 9.5 పాయింట్లతో బంగారు పతకాన్ని, గోవాకు చెందిన ఎఫ్‌ఎం వాజ్‌, ఈథాన్‌ 9 పాయింట్లతో కాంస్య పతకాన్ని అందుకున్నారు. అంతకుముందురోజు జరిగిన జాతీయ ర్యాపిడ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో రాజా రిత్విక్‌ కాంస్య పతకం గెలుచుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర చెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కేఎస్‌ ప్రసాద్‌ అభినందనలు తెలిపారు.