2001 నుంచి అమెరికా యుద్ధాలతో 45 లక్షల మంది ప్రజలు మృతి

బ్రౌన్‌ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ”యుద్ధం ఖరీదు” అనే రీసెర్చ్‌ ప్రోజక్టు ఈ వారంలో విడుదల చేసిన నివేదిక ప్రకారం 2001లో అమెరికాలోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ పై, పెంటగాన్‌పై టెర్రరిస్టు దాడి జరిగిన తరువాత అమెరికా సైన్యం వివిధ దేశాలపై చేసిన యుద్ధాలలో 45 లక్షల మం ది చనిపోయారు. ఈ రీసెర్చ్‌ ప్రోజక్టు యుద్ధా లలో ప్రత్యక్షంగా చనిపోయినవారి సంఖ్యకు సంబంధించిన అంచనాల ను తరచుగా విడుదల చేస్తుంది. అంతేకాకుండా యుద్ధాల వల్ల వ్యవ సాయం, ఆరోగ్య సంరక్షణ, రవాణా, ఒక్కమాటలో చెప్పాలంటే ఆర్థిక వ్యవ స్థ విచ్చిన్నం కావటం వల్ల పరోక్షంగా చనిపో యినవారి సంఖ్యను అంచనా వేస్తుంది. అప్గానిస్తాన్‌, ఇరాక్‌, లిబియా, సోమాలియా, సిరియాలలో జరిగిన యుద్ధాల లో మరణించినవారు ఈ 45లక్షల హతుల లో ఉన్నారు. యుద్ధాలలో చనిపోయిన అమె రికా సైనికులు, కాంట్రాక్టర్స్‌, యుద్ధం పర్యవ సానంగా చనిపోయిన వారిపై ఈ నివేదిక తన దృష్టిని సారించలేదు. ఉక్రెయిన్‌లో జరు గుతున్న యుద్ధం స్వేచ్చ, ప్రజాస్వామ్యం, మానవ హక్కుల కోస మని అమెరికా చేస్తున్న ప్రచారం ఎంతటి మోసమో ఈ నివేదిక తేట తెల్లం చేస్తోంది. భూగ్రహం మీద అత్యంత హింసాత్మకమైన, పరుల రక్తంతో తడిసిన శక్తి ఏదైనా ఉందంటే అది అమెరికానే అవు తుంది. రష్యాపై అమె రికా, దాని మిత్ర నాటో కూటమి దేశాలు ఉక్రెయిన్‌లో చేస్తున్న పరోక్ష యుద్ధం గనుక మరింత తీవ్ర రూపం దాలిస్తే అప్పుడు గత 22 ఏండ్లలో అమెరికా చేసిన యుద్ధాలలో చనిపోయిన వారి సంఖ్యను దాటి మరణాలు ఉంటాయి. అమెరికా చేసిన యుద్ధాల వల్ల 45 లక్షల మరణాలు సంభవిం చాయనే అంచనాలో పొరపాటు శాతం కొద్దోగొప్పో ఉన్నప్పటికీ ప్రాణ నష్టం ఊహాతీ తంగా ఉంది. ”21వ శతాబ్దపు యుద్ధాలు” అని పేర్కొన్న జార్జి డబ్ల్యు బుష్‌ అప్గానిస్తాన్‌, ఇరాక్‌ దేశాలలో యుద్ధాలను మొదలెట్టాడు. ఆ తరువాత బారక్‌ ఒబామా ఈ రెండు యు ద్ధాలను కొనసాగిస్తూ లిబియా, సిరియా, యె మెన్‌లలో యుద్ధాలను పరోక్షంగాను, ప్రత్యక్ష ంగాను ఆరంభించాడు. డోనాల్డ్‌ ట్రంప్‌, జో బిడెన్‌ ఆ ఐదు యుద్ధాలను ఏదో ఒక రూపం లో కొనసాగించారు. అమెరికా చేసిన ఆరో యుద్ధం సోమాలియాలో జరిగింది. అమెరికా దురాక్రమణ గురైన దేశాల న్నింటికంటే నాశ నమైన దేశం అప్గానిస్తాన్‌. అప్గానిస్తాన్‌ను అమెరికా 20 ఏండ్లపాటు దురాక్రమించింది. అప్గానిస్తాన్‌ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమైం ది. దేశంలోని సగం జనాభా తీవ్ర దారిద్య్రం లో మగ్గుతోంది. సామ్రాజ్య వాదానికి, యుద్ధా నికి అవినాభావ సంబంధం ఉంటుంది. యు ద్ధాలు లేకుండా పెట్టుబడిదారీ వ్యవస్థ మన జాలదు. అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడి దారీ వ్యవస్థకు ఒక ప్రత్యామ్నాయం ఏర్పడిం దాకా ఇలా అమెరికా నేతృత్వంలో ఎక్కడో ఒక చోట సామ్రాజ్యవాద యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. సైనికులే కాకుండా సామాన్యులూ వేల సంఖ్యలో హతులౌతూనే ఉంటారు.