కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం. సింగపురం ఇందిరా

నవతెలంగాణ-ధర్మసాగర్:
 కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమని టీ పిసిసి ప్రధాన కార్యదర్శి స్టేషన్గన్పూర్ ఇన్చార్జ్ సింగపురం ఇందిర అన్నారు. గురువారం మండలంలోని పెద్ద పెండ్యాల గ్రామంలో ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  తెలంగాణ ప్రగతి కోసం ప్రజల భవిత కోసం కాంగ్రెస్ పార్టీ ఆరు సంక్షేమ పథకాలను ప్రజల ముందుకు తీసుకొచ్చామని అన్నారు. మహాలక్ష్మి మహిళలకు ప్రతి నెలా రూ. 2500. 500కే గ్యాస్ సిలిండర్ ను అందిస్తామన్నారు. అంతేకాకుండా మహిళా మణులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసే సౌకర్యాన్ని అందిస్తామని తెలిపారు. రైతులకు  రైతు భరోసా ప్రతి ఏటా రైతులకు మరియు కౌలు రైతులకు ఎకరాకు రూ. 15000,ప్రతి ఏటా భూమి లేని పేదలకు 12000, ప్రతి ఏటా వరి పంటకు రూ.500 బోనస్ అన్ని తీరుతామని ఆరోపించారు.  గృహాజ్యోతిప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. ఇండ్లు ఇల్లు లేని వారికి ఇంటి స్థలం & ఇల్లు నిర్మించుకోవడానికి రూ.5 లక్షలు అందించే సాక్ష్యం చేపట్టిందాన్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర కోసం పోరాడిన ఉద్యమకారులకు 250 చ.గ ఇంటి స్థలం అందించు కుంటామన్నారు. యువ వికాసం విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ నిర్మిస్తామన్నారు. చేయూత రూ. 4000 నెలవారీ పింఛను. రూ. 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమ  కల్పించే ఆదుకుంటామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు లింగాల సుభాష్ రెడ్డి, మండల అధ్యక్షులు గుర్రపు ప్రసాద్,మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు దివాకర్, మండల మహిళా అధ్యక్షురాలు యామిని సురేష్, మండల బీసీ సెల్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, పెద్ద పెండ్యాల గ్రామ శాఖ అధ్యక్షులు కొత్తపల్లి విశ్వవిద్యా, మండల సీనియర్ నాయకులు గొట్టం శ్రీనివాస్, మండల యువజన నాయకులు వికాస్ రెడ్డి, గ్రామ యువజన సంఘం నాయకులు, మహిళా నాయకురాలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.