– మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బోనస్ వట్టి బోగస్ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే టీ హరీశ్‌రావు విమర్శించారు. మొత్తం రూ.4,701 కోట్లలో 33శాతాన్ని బోనస్‌గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. లాభాల వాటాలో 50 శాతం కోత విధిస్తూ కార్మికులకు సీఎం రేవంత్‌రెడ్డి అన్యాయం చేశారన్నారు. 2022-23లో సంస్థకు రూ.2,222 కోట్లు లాభాలు వస్తే, దానిలో దానిలో రూ.710 కోట్లు (32 శాతం) బోనస్‌గా ఇచ్చామని తెలిపారు.