– బీఎంఎస్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన
నవతెలంగాణ-కోల్ బెల్ట్
సింగరేణి భూములను అధికార అండదండలతో కబ్జా చేస్తున్న నాయకుల నుండి కాపాడాలని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఫ్‌ు (బీఎంఎస్) భూపాలపల్లి బ్రాంచ్ ఉపాధ్యక్షులు అప్పాని శ్రీనివాస్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. సింగరేణి యాజమాన్యం అధికార బీఆర్‌ఎస్, టీబీజీకేఎస్ లతో అంట కాగుతూ తీసుకుంటున్న అనేక చర్యలపై , క్వార్టర్ల కౌన్సిలింగ్ విధానం తదితర విషయాలపై నిరసన కార్యక్రమాలు చేపట్టడం, బుధవారం నుండి మూడు రోజులపాటు కార్యాచరణ ప్రకటించారు. అందులో భాగంగా బుధవారం శ్రీనివాస్ నేతత్వంలో భూపాలపల్లి డివిజన్‌లోని వివిధ గనులపై ఆయా గనుల నాయకుల ఆధ్వర్యంలో కార్మికులకు నల్ల బ్యాడ్జీలు ధరింపజేసి నిరసన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భూపాలపల్లి ఏరియాలో సెప్టెంబర్ 15న నిర్వహించ తలపెట్టిన క్వార్టర్స్ కౌన్సిలింగ్ విధానం లోపభూయిష్టంగా ఉందని , దానిని అడ్డుకొని తీరుతామని , సరైన రీతిలో కౌన్సిలింగ్ నిర్వహించుకుంటే లేకుంటే బాధిత కార్మిక కుటుంబాలతో కౌన్సిలింగ్ నుఅడ్డుకుంటామని హెచ్చరించారు. నిరసన కార్యక్రమాల్లో భాగంగా 13 న గనులు/డిపార్ట్ మెంట్ లలో నల్ల బ్యాడ్జీలతో నిరసన.14 న జనరల్ మేనేజర్ కి మెమోరాండం సమర్పించుట.15 న క్వార్టర్స్ కౌన్సిలింగ్ బహిష్కరణ, జి.ఏం. ఆఫీస్ ముందు ధర్నా…. కార్యక్రమాలను విజయవంతం చేయాలని అప్పానికార్మికులకు పిలుపునిచ్చారు. ఈ నిరసనల కార్యక్రమం కేటికే-1 లో వి.సుజెందర్ ,అల్లం శ్రీనివాస్,కే..భాస్కర్, రమేష్ ల ఆధ్వర్యంలో, కేటికే-5 లో గట్ల మల్లారెడ్డి,రఘుపతి రెడ్డి,పని రమేష్, కొత్తూరి మల్లేష్ ఆధ్వర్యంలో కేటికే-6 లో పండ్రాల మల్లయ్య,నర్సింగరావు, జనార్దన్, బత్తుల స్వామి ఆధ్వర్యంలో, కేటికే ఓసి త్రీ, లాంగ్ వాల్ ప్రాజెక్టులో రెణికుంట్ల మల్లేష్,కడారి శంకర్, యూసుఫ్, నారాయణ,అడప రాజు, ఉదరు కుమార్ ఆధ్వర్యంలో , కేటికే ఓసి 2 లో అప్పాని శ్రీనివాస్, రాజిరెడ్డి, రగుపతి రెడ్డి, సదానందం, దామోదర్ ,లక్ష్మణ్ ,మధుకర్, మొగిలి ఆధ్వర్యంలో జరిగింది.