విలక్షణ తీర్పునిచ్చిన సింగరేణి కార్మికులు

విలక్షణ తీర్పునిచ్చిన సింగరేణి కార్మికులుఅనేక సంవత్సరాల కాలయాపన తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు ఎట్టకేలకు సింగరేణిలో డిసెంబర్‌ 27న ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు వాయిదా వేయిం చాలని సర్కార్‌ సంఘాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. ఏఐటీయూసీ విజయం సాధించడాన్ని స్వాగతిస్తున్నాం. ఏఐ టీయూసీ కార్మికులకు ఇచ్చిన హామీలను, వారి ఆకాంక్షలను నెరవేర్చడంలో సఫలం కావాలని ఆశిస్తున్నాం. ఈసారి సీఐటీయు మూడో స్థానం లోకి వచ్చింది. రామగుండంలోని మూడు ఏరియాల్లో కలిపి 2,437 ఓట్లు సాధించి ప్రధాన సంఘాలకు ధీటుగా నిలబడింది. సుదీర్ఘకాలం పాటు ప్రభుత్వ విధానాలకు వ్య తిరేకంగా స్థానిక సమస్యలపై సీఐటీయు చేసిన పోరాటాలే పుంజుకోవడానికి ప్రధాన కారణం. ఇతర సంఘాలతో పాటు ప్రజాప్రతినిధులందరూ ఎన్ని ప్రయత్నాలు చేసినా సీఐటీ యుకు స్వచ్ఛందంగా కార్మికులు ఓట్లు వేశారు. ఈ ఎన్నికల్లో సింగరేణి కార్మికులు విలక్షణమైన తీర్పునిచ్చారు. ఏఐటి యుసికి గుర్తింపు సంఘంగా బాధ్యతను ఇస్తూనే అధికార పార్టీ సంఘం ఐఎన్‌టియుసిని కూడా ఆరు డివిజన్లో గెలి పించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తమ వంతు కర్తవ్యం నిర్వ ర్తించాలని నిర్దేశించారు. నిబద్దతతో పోరాడే సీఐటీయుకు మంచి ఓటింగ్‌ ఇచ్చి భవిష్యత్తు పోరాటాలకు నాంది పలికారు.
ఈ ఎన్నికల్లో సింగరేణి కార్మికులను ప్రభావితం చేసిన ప్రధాన సమస్యలేవంటే -ఒకటి. పదేండ్లపాటు బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వ విధానాలపైన కార్మిక వర్గం విసిగిపోయి ఉ న్నారు. రెండవది కొత్త బావులు తవ్వలేదు. మూడవది అవి నీతి, పైరవీలు ప్రతి పనికి లంచాలు విపరీతంగా పెరిగి పోయాయి. నాలుగవది సింగరేణి నిధులను సొంత ఆస్తు లాగా ప్రభుత్వం వాడుకోవడాన్ని కార్మికులు జీర్ణించుకోలేక పోయారు. ఐదవది ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. ఆరవది సింగరేణి సంస్థలో ప్రయివేటీకరణ, కాంట్రాక్టీకరణ, ఔట్‌సోర్సింగ్‌ విధానాలు యథేచ్చగా పెరిగి పోవడం, కాంట్రాక్ట్‌ కార్మికుల సంఖ్య 22వేలకు పైగా పెర గడం వారిని పర్మినెంట్‌ చేయకపోవడం , బీఆర్‌ఎస్‌ అను బంధ సంఘం వీటిని ప్రశ్నించలేకపోవడం పైగా ప్రభుత్వా నికే ఊడిగంచేయడంతో ప్రభుత్వ అనుబంధ సంఘాలు గెలవకూడదని కార్మికులు నిశ్చయానికి వచ్చారు. ఐఎన్‌టియుసి ఓడిపోవడానికి ఇది కూడా ఒక కారణం.
మరోవైపు సీఐటీయు గత కొంత కాలంగా చేసిన పోరాటాల ఫలితంగా కొన్ని సమస్యలను ఈసారి ఎన్నికల్లో అన్ని యూనియన్లు తమ ఎజెం డాగా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాటిలో సింగరేణి కార్మికులకు సొంత ఇంటి కల నెరవేర్చాలని, 2011లో కోల్‌ ఇండి యాలో జరిగిన ఒప్పందం ప్రకారం సింగరే ణిలో కూడా పెర్క్స్‌ పైన ఆదాయపన్ను తిరిగి కార్మికులకు చెల్లించాలని ప్రధాన సమస్య. సింగరేణి కార్మికుల పిల్లలకు సీబీఎస్‌ఈ సిల బస్‌తో కూడిన విద్య ఉండాలని, సింగరేణి హాస్పిటల్స్‌ను అభివద్ధి చేయా లని, కార్మికుల కాలనీలలో రోడ్లు వేయాలని, డ్రెయినేజీ వ్య వస్థ మెరుగుపరచాలని మిషన్‌ భగీరథ నీళ్లు అందించాలని ఎన్నికల్లో సీఐటీయూ ప్రచారం చేసింది. ఈ అంశాలన్నీ ప్రభావితం చేయడంతో ఏఐటీయూసీ, ఐఎన్‌టియుసి కూ డా వాటిని హామీ ఇచ్చారు. రాబోయే కాలంలో బొగ్గు బావు ల ప్రయివేటీకరణ ఆపడం, కొత్త బావులు తవ్వడం సింగ రేణి కార్మికులకు సొంత ఇల్లు, అలవెన్స్‌ల సమ స్యలను గెలిచిన సంఘం పరిష్కరించవలసి ఉం టుంది. ఓడిపోయిన ఐఎన్టీయూసీ కూడా తమ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ప్ర భుత్వం పైన ఒత్తిడి తీసుకొని వచ్చి సాధించవలసిన అవసరం ఉంటుంది. ఈ సమస్యలపై రాబోయే కాలంలో కూడా ఐక్య ఉద్యమాల కోసం సీఐటీ యు శక్తివంచన లేకుండా కషి చేయాల్సిన అవ సరం ఉంది. రోజురోజుకూ నిర్వీర్యం కాబోతున్న సింగరేణి సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మికులపై, సంఘాలపై ప్రధానంగా ఉంది.
సింగరేణిలో ప్రయివేటీకరణ విధానాలు!
సింగరేణి గనులు 1889లో ప్రారంభమ య్యాయి. సింగరేణి సంస్థలో రాష్ట్రం 51 శాతం, కేంద్ర వాటా 49 శాతం ఉన్న సంగతి తెలిసిందే. గోదావరి ప్రాణహిత నది పరివాహక ప్రాంతంలో 350 కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. ప్రస్తుతం 24 భూగర్భంలో 18 ఉప రితల గనులు మొత్తం 42 గనులున్నాయి. మరో వంద సం వత్సరాలకు సరిపడా బొగ్గు నిలువలు కలిగి ఉంది. 2022- 23 ఆర్థిక సంవత్స రంలో67 మిలియన్‌ టన్నుల బొగ్గు ను ఉత్పత్తి చేశారు. రూ.32,978 కోట్ల టర్నోవర్‌ సాధించింది. రూ.2,184 కోట్లు లాభాలు వచ్చాయి. తొలిసారిగా ఒడిషా లో నైని బొగ్గు బ్లాక్‌ను సింగరేణి పొందింది. 16 రాష్ట్రాల్లోని పరిశ్రమలకు బొగ్గు రవాణా చేస్తున్నది. రాష్ట్రంలోని జెన్కోకు ఇతర విద్యుత్‌ ప్లాంట్లకు కూడా పెద్ద ఎత్తున బొగ్గు సరఫరా చేస్తున్నది. సుమారుగా రాష్ట్ర ప్రభుత్వం రూ.29 వేల కోట్లు సింగరేణికి బకాయి పడిందని లెక్కలు చెప్తున్నారు. సింగరేణి నిధులను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పప్పు బెల్లల్లాగా వాడుకు న్నది. ఈ పదేండ్ల కాలంలో సింగరేణి సంస్థ కేంద్ర ప్రభుత్వా నికి రూ.26,208 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వానికి రూ.23,446 కోట్లు వివిధ రకాల టాక్సులు, రాయల్టీల రూపంలో చెల్లించింది.
అపారమైన ఈ సంపదను ప్రయివేటు వాళ్లకు కొల్లగొట్టి పెట్టాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయ త్నిస్తూ ఉన్న ది. రాష్ట్ర ప్రభుత్వం కొత్త బావులు తవ్వకుండా ఉన్న వాటిలోనే ప్రయివేటు కాంట్రాక్టు విధానాల అమలు చేస్తూ కార్మికులను, సంస్థ నిధులను దోచుకుంటున్నది. 1998లో 1,06,00మంది ఉద్యోగులు ఉంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 2012లో ఎన్నికలు జరిగినప్పుడు టీఆర్‌ఎస్‌ సంఘం గెలిచిన సందర్భంగా 65 వేల మందికి తగ్గారు. ఈ కాలంలోనే ఏఐటీయూసీ, ఐఎన్‌టియుసి గుర్తింపు సంఘాలుగా పనిచేశాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2017లో మరొకసారి ఎన్నికలు జరిగిన ప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ జోక్యం చేసుకొని కార్మికు లకు ఇచ్చిన హామీల వల్ల గెలిచారు. కానీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ కాలంలోనే 2023 నాటికి వచ్చేసరికి ఇది 25 వేల ఉద్యో గాలు తగ్గిపోయి 37,773కు చేరింది. డిపెండెంట్‌లకు ఉద్యోగాలివ్వాలని, కారుణ్య నియామకాలు ఉండాలని పెద్ద ఎత్తున పోరాడితే 2018లో 15256 మందికి వారసులకు ఉద్యోగాలు వచ్చాయి. ప్రస్తుతం సగం పాత వారు సగం యువతతో సింగరేణి కార్మికవర్గం ఉంది. 2002వ సంవ త్సరంలో ఏఐటియుసి గుర్తింపులో ఉన్న సందర్భంగా డి పాండెంట్ల ఉద్యోగాలను రద్దు చేస్తూ ఒప్పందం చేసుకు న్నారు. ఫలితంగా 16 సంవ త్సరాల పాటు డిపెండెంట్‌లకు ఉద్యోగాలు లేకుండా నష్టం ఏర్పడింది. సింగరేణి వ్యాప్తంగా కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్‌ విధానం విస్తరించింది.బొగ్గును ప్రయివేటు యంత్రాల ద్వారా తీస్తున్నారు. సింగరేణి ప్రభు త్వ సంస్థగా సొంతంగా బొగ్గు బావులు తవ్వుకోవడానికి అవకాశం ఉన్నా ప్రయివేటు సంస్థలకు అవకాశం ఇస్తు న్నారు. హెవీ మిషనరీ అంతా ఆపరేషన్‌ మెయింటెనెన్స్‌ పేరిట ప్రయివేటు సంస్థలే నిర్వహిస్తున్నాయి. ఒడిషాలోని నైనీ బ్లాకును, భూపాలపల్లి లోని కాకతీయ 2,5లను, మంద మర్రిలోని శాంతిఖని, శ్రీరాంపూర్‌లో ఆర్‌కెపి-7, న్యూ టెక్‌ గనులను లాంగ్‌వాల్‌, షార్ట్‌వాల్‌ పేరుతో ప్రయివేటు కంపె నీలకు కట్టబెట్టింది.అండర్‌ గ్రౌండ్‌లో రూప్‌ బోల్టింగ్‌, శ్రాబ్‌ , బెల్ట్‌ క్లీనింగ్‌, కోల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అంతా కాంట్రాక్టర్లే నిర్వహి స్తున్నారు. కోల్‌ శాంప్లింగ్‌ అవుట్‌సోర్సింగ్‌ ఇచ్చారు. రూ.8 వేల కోట్లతో నిర్మించిన జైపూర్‌ పవర్‌ ప్లాంట్‌ నో స్టిగ్‌ జర్మనీ కంపెనీకి అప్పగించింది. సివిల్‌ వర్క్స్‌, ఆఫీసులు, గార్డెన్లు, నర్సరీలు, క్యాంటీన్‌లతో సహా ప్రయివేటు ఔట్‌సోర్సింగ్‌కి ఇచ్చారు. సిరుల కురిపించే సింగరేణి సంస్థ ప్రయివేటు సం స్థల వారికి స్వర్గధామంగా విలసిల్లుతున్నది. దీనికి ప్రభు త్వాలు ఎంత కారణమో గుర్తింపు సంఘాలుగా పని చేసిన సంఘాలు కూడా పరోక్షంగా అంతే కారణం.
గుర్తింపులో లేకున్నా సీఐటీయు నిరంతరం పోరాటం !
జేబీసీసీఐలో మెంబర్‌గా ఉంటూ వేతన ఒప్పందాల సందర్భంలో కార్మికులకు న్యాయంగా రావలసిన అంశాలపై సీఐటీయు పట్టుబట్టి పోరాడి సాధించింది. ఇప్పటివరకు 11 వేతన ఒప్పందాలు జరిగాయి. ఐదవ వేతన ఒప్పం దంలో చొరవచేసి 210 పాయింట్లు పాయింట్‌కు రెండు రూపాయలు చొప్పున జరిగిన నష్టాన్ని సరి చేయించిం ది. ఆరవ వేతన ఒప్పందంలో మూడు ఇంక్రిమెం ట్లు ఇప్పించింది. ఏడవ వేతన ఒప్పందంలో వేతన ఒప్పం దాలు ఐదేండ్ల కాలపరిమితి ఉండాలని, ఎనిమి దవ వేతన ఒప్పందంలో జీతం పెరుగుదల పర్సెంటేజ్‌ లోకి తీసుకు రావాలని, డిఏ న్యూట్రిలైజేషన్‌ చేయాలని మూ డు శాతం కుములేటివ్‌ ఇంక్రిమెంటు, తొమ్మిదవ వేతన ఒప్పందంలో కాంట్రాక్ట్‌ కార్మికుల వేతనాలు జేబీ సీసీఐ అగ్రిమెంట్లో రూపొందించడం జరిగింది. సీఎం పిఎఫ్‌ వడ్డీ రేటును 2018 నుంచి 20 మధ్యకాలంలో 8.5 శాతానికి బదులు 8శాతం లెక్కిస్తే సరిచేయించి వేల రూపాయలు కార్మికులకు ఇప్పించింది. సింగరేణి కార్మి కుల కోసం 250 గజాల స్థలం కొలిండియా మాదిరిగా రూ.30లక్షల వడ్డీ లేని రుణం లేదా వారు నివసిస్తున్న క్వా ర్టర్‌ వారికి పర్మినెంట్‌ చేయాలని సొంతింటి పథకం అమలు చేయాలని రాష్ట్ర అధ్యక్షులు ఆమరణ నిరాహార దీక్షలతో సహా పెద్దఎత్తున పోరాటాలు చేసిన ఫలితంగా ఈరోజు ఎజెండా ముందుకొచ్చింది.
రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వం కమర్షియల్‌ మై నింగ్‌ పేరుతో తెలంగాణలో బొగ్గు బావులను ప్రయివేటు ప రం చేయబోతున్నది. సింగరేణిలో ఇప్పుడున్న అండర్‌ గ్రౌండ్‌ ఓపెన్‌ కాస్ట్‌ బొగ్గు నిక్షేపాలు 10 నుండి 15 ఏండ్ల లో పూర్త వుతాయి. కొత్త బొగ్గు బ్లాక్‌లు రాకపోతే సింగరేణి భవిష్యత్తు ప్రశ్నర్థకమే. సింగరేణి పరిశ్రమను రక్షించుకోవాల్సిన ప్రధాన కర్తవ్యం కార్మికవర్గానిదే. గతంలో సీఐటీయు చొరవతో మూ డు రోజులపాటు సమ్మె చేసి బొగ్గు బావులు ప్రయివేటు కా కుండా అడ్డుకున్నది సింగరేణి కార్మిక వర్గం. గెలిచిన ఏఐటీ యూసీ గాని, అధికార కాంగ్రెస్‌ అనుబంధ సంస్థ ఐఎన్‌టి యుసిలు పైరవీలకు ప్రాధాన్యతనివ్వకుండా పోరాటాలకు ప్రాధాన్యతనిస్తూ అందరినీ కలుపుకొని పోవాలి. ఓడిన సంఘాల కార్యకర్తలను వేధించకుండా, బ్లాక్‌ మెయిల్‌ చేయకుండా కార్మికవర్గ స్ఫూర్తిని కొనసాగించాలి.
భూపాల్‌
9490098034