ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం ద్వారా రైతులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నట్లు సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్ తెలిపారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా సింగిల్ విండో కార్యాలయం ఎదుట ఆదివారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సహకార సంఘం ద్వారా రైతులకు సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ గణతంత్ర వేడుకల్లో సింగిల్ విండో కార్యదర్శి జే బాబురావు సింగిల్ విండో పాలకవర్గం సభ్యులు సింగిల్ విండో మాజీ చైర్మన్లు పాకల విజయ్ కొండ గంగాధర్ రైతులు సహకార సంఘం సిబ్బంది పాల్గొన్నారు.