
నవతెలంగాణ – మల్హర్ రావు
కాటారంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు డైరెక్టర్లు శనివారం తెలంగాణ ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో హైదరాబాద్ గాంధీ భవన్లో చేరారు. కాంగ్రెస్ తీర్టం పుచ్చుకున్నవారిలో అయిలి రాజబాపు, మరపాక రాజేశ్వరి,మరపాక వెంకటి, అయితే కృష్ణవేణి,తోటపల్లి ప్రశాంత్, దండు రాజయ్య, జక్కుల ఐలయ్య ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పంతకాని సమ్మయ్య, మాజీ ఉపసర్పంచ్ నాయిని శ్రీనివాస్ కుంభం రమేష్ రెడ్డి, కుంభం స్వప్న, చీమల సత్యం, తెప్పల దేవేందర్, తెప్పల ప్రభాకర్, కామిడి వెంకటరెడ్డి పాల్గొన్నారు.