
నవతెలంగాణ – బొమ్మలరామారం
కాంగ్రెస్ పార్టీలో పాత, కొత్త అనే తారతమ్యం లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఐక్యంగా పనిచేయాలని ప్రభుత్వం విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. బుధవారం బొమ్మలరామారం మండలం మైలారం గ్రామానికి చెందిన సింగల్ విండో వైస్ చైర్మన్ ఏనుగు కొండల్ రెడ్డి ఐలయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో పార్టీలో చేరారు.నూతనంగా పార్టీలో చేరిన కొండల్ రెడ్డికి హస్తం కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… పార్టీలోని ప్రతి ఒక్కరు ఐక్యంగా ఉండి పనిచేస్తేనే పార్టీ పటిష్టంగా ఉంటుందని పేర్కొన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు,ఇండస్థలాలు, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అందుతాయని పేర్కొన్నారు.పార్లమెంట్ ఎన్నికలలో చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా పనిచేయాలని కోరారు.పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, మాదిరెడ్డి ముకుంద రెడ్డి, బుడుమ సురేష్, బుడుమ నరేష్, మాదిరెడ్డి శివారెడ్డి , భువనగిరి మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రామిడి రామిరెడ్డి, బుడుమ శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు.