మూడోరౌండ్‌కు సిన్నర్‌

Sinner for the third round– ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ
మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో టాప్‌సీడ్‌, ఇటలీకి చెందిన జెన్నిక్‌ సిన్నర్‌ హవా కొనసాగుతుంది. గురువారం జరిగిన రెండోరౌండ్‌ పోటీలో సిన్నర్‌ ఆస్ట్రేలియాకు చెందిన షూల్కేట్‌ను 4-6, 6-4, 6-1, 6-3తో చిత్తుచేశాడు. ఇక ఐదుసెట్ల హోరాహోరీ పోరులో 17వ సీడ్‌, అమెరికాకు చెందిన టఫీ అనూహ్యంగా రెండోరౌండ్‌లోనే ఓటమిపాలయ్యాడు. అన్‌సీడెడ్‌ మరోజస్మన్‌(హంగేరీ) 7-6(7-3), 4-6, 6-3, 4-6, 6-1తో టఫీని ఓడించాడు. ఇతర పోటీల్లో 4వ సీడ్‌, ఫ్రిట్జ్‌(అమెరికా) 6-2, 6-1, 6-0తో గారిన్‌(చిలీ)పై, 8వ సీడ్‌, డి మినర్‌(ఆస్ట్రేలియా) 6-2, 6-4, 6-3తో బోయర్‌(అమెరికా)ను చిత్తుచేసి ముందుకు దూసుకెళ్లారు. ఇక 16వ సీడ్‌ మసెట్టి(ఇటలీ) 7-6(7-3), 7-6(8-6), 6-2తో కెనడాకు చెందిన షపొవలోవ్‌ను, 21వ సీడ్‌ షెల్టన్‌(అమెరికా) 6-3, 6-3, 6-7(4-7), 6-4తో కారెనో(స్పెయిన్‌)ను చిత్తుచేసి మూడోరౌండ్‌కు చేరారు.
మహిళల సింగిల్స్‌లో సీడెడ్ల ముందంజ..
మహిళల సింగిల్స్‌లో సీడెడ్‌ క్రీడాకారిణులు మూడోరౌండ్‌లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన రెండోరౌండ్‌ పోటీల్లో 4వ సీడ్‌, పోలిని(ఇటలీ), అమెరికాకు చెందిన 10వ సీడ్‌ కోలిన్స్‌, 19వ సీడ్‌ కీస్‌తోపాటు 28వ సీడ్‌ స్విటోలినా(ఉక్రెయిన్‌) మూడోరౌండ్‌కు చేరారు. పోలిని 6-2, 6-3తో జరాజు(మెక్సికో)ను, కోలిన్స్‌ 7-6(7-4), 4-6, 6-2తో ఐవా(ఆస్ట్రేలియా)ను ఓడించారు. ఇక కీస్‌ 7-6(7-1), 2-6, 7-5తో రూసే(జర్మనీ)ను ఓడించారు. ఏకపక్షపోరులో స్వీటోలినా 6-1, 6-4తో డొలెహైడే(అమెరికా)ను ఓడించింది.
పురుషుల డబుల్స్‌లో భారత నిరాశ.. : పురుషుల డబుల్స్‌లో ముగ్గురు భారత జోడీలు ఓటమిపాలయ్యారు. ప్రశాంత్‌-నెడుంఛేజియన్‌ 2-6, 6-2తో బ్రెజిల్‌-ఫ్రాన్స్‌ జంట చేతిలో, బల్లిపల్లి(భారత్‌)-సెగ్మన్‌(అమెరికా) జంట 6-7(5-7), 1-6తో 6వ సీడ్‌ చేతిలో ఓటమిపాలయ్యారు. ఇక చంద్రశేఖర్‌(భారత్‌), డ్రెవ్‌జెస్కీ(పోలండ్‌) జంట 6-7(1-7), 6-2, 6-7(6-10)తో సిట్సిపాస్‌(గ్రీక్‌)- జుంహార్‌(బోస్నియా) చేతిలో పోరాడి ఓడారు. ఇక బాలాజీ-రైయాస్‌(మెక్సికో) జంట 6-4, 6-3తో కజకిస్తాన్‌-ఫ్రాన్స్‌ జంటను చిత్తుచేసి రెండోరౌండ్‌కు చేరారు.