
నవతెలంగాణ- సిరిసిల్ల రూరల్
రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పడటానికి ప్రధానంగా ఉద్యమం చేసిన చొక్కాల రాము కు వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ సిరిసిల్ల అసెంబ్లీ టికెట్ ను అధినేత్రి షర్మిల గురువారం ప్రకటించారు. సిరిసిల్ల ను జిల్లాగా ప్రకటించాలని ఉద్యమం చేయడంతో ఆయనపై పోలీసులు కేసులు నమోదు చేసి జైలు పంపించారు. ఆయన చేసిన ఉద్యమంతో నే ప్రభుత్వం రాజన్న సిరిసిల్ల జిల్లాను ప్రకటించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి చొక్కాల రాము పార్టీలోనే ఉన్నారు. అలాగే వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఏర్పడిన సమయంలో రాము పార్టీలో అలాగే కొనసాగాడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో వైయస్సార్ తెలంగాణ పార్టీ నుంచి అనేక ధర్నాలు నిరసనలు తెలుపుతూ ప్రభుత్వం ను ప్రశ్నిస్తూ వస్తున్నాడు వైయస్సార్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్న ఆయనను పలు పార్టీలు తమ పార్టీలో చేర్చుకోవడం కోసం ప్రయత్నాలు జరుగుతుండగా అతనికే వైయస్సార్ తెలంగాణ పార్టీ సిరిసిల్ల నుంచి టికెట్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.