
మండలంలోని వ్యవసాయంలో దేశంలోనే పేరు ప్రఖ్యాతలు ఉన్న అంకాపూర్ గ్రామాన్ని గురువారం సిరిసిల్ల రాజన్న జిల్లా కోనరావుపేట మండలం మామిడి పెళ్లి గ్రామ ఆదర్శ సహకార సంఘ రైతులు 45 మంది సందర్శించినారు. వీరందరూ ప్రత్యేకంగా బస్సు ఏర్పాటు చేసుకొని అంకాపూర్ గ్రామంలో సాగు చేస్తున్న వివిధ రకాల పంట సాగును మేలుకువలను తెలుసుకోవడం జరిగింది. మక్క, పల్లి ,పసుపు ,వరి డ్రిప్ ఇరిగేషన్ పలు రకాల పంట సలహాలు మేలుకువలు తెలుసుకోవడం జరిగింది. కమ్యూనిటీ హాల్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకోగా ఆదర్శ రైతులు దేవారావు ,రమేష్, శ్రీనివాస్, బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.