సిసి రోడ్డు పనులు ప్రారంభం 

నవతెలంగాణ- రామారెడ్డి 
మండలంలోని గొల్లపల్లి గ్రామంలో బుధవారం రు 5 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధుల తో సీసీ రోడ్డు పనులను కాంగ్రెస్ నాయకులు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గౌడ్ మాట్లాడుతూ… గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని, ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు మదన్మోహన్రావు మండల అభివృద్ధిలో భాగంగా సిసి రోడ్డు లకు నిధులు కేటాయించినందుకు మండల ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గొల్లపల్లి లక్ష్మా గౌడ్, కాంగ్రెస్ నాయకులు రంగు రవీందర్ గౌడ్, శిలా సాగర్, కిషన్ యాదవ్, నామాల రవి, మోహన్ నాయక్, జెసిబి శేఖర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.