సీతా కళ్యాణ వైభోగమేకి విశేష స్పందన

సీతా కళ్యాణ వైభోగమేకి విశేష స్పందనప్రస్తుతం ఉన్న ఈ మోడ్రన్‌ ప్రపంచంలో ప్రేమ, పెళ్లి అనే పదాలకు అర్థాలే మారిపోయాయి. కానీ త్రేతాయుగంలో సీతారాములు చూపించిన దారిలో నడవడం, విలువలు పాటించడమంటే మామూలు విషయం కాదు. విలువల్ని మర్చిపోతున్న ఈ తరానికి ప్రేమ, పెళ్లి గొప్పదనం చెప్పడం, రాముడు పాటించిన విలువలు, సీత గొప్పదనం చెప్పేలా నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా తీసిన సినిమా ‘సీతా కళ్యాణ వైభోగమే’. సుమన్‌ తేజ్‌, గరిమ చౌహాన్‌ హీరో, హీరోయిన్లుగా డ్రీమ్‌ గేట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సతీష్‌ పరమవేద దర్శకత్వంలో రాచాల యుగంధర్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 21న విడుదలైన ఈ సినిమా థియేటర్లో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత రాచాల యుగంధర్‌ మాట్లాడుతూ, ‘ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ ఓ క్లీన్‌ చిత్రం కావడంతో అన్ని వర్గాలను మా సినిమా ఆకట్టుకుంటోంది. కమర్షియల్‌గా ఈ సినిమా వర్కౌట్‌ అవుతోందని ట్రేడ్‌ వర్గాలు విశ్లేషించడం ఆనందంగా ఉంది. చరణ్‌ అర్జున్‌ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మొదటి సినిమానే అయినప్పటికీ ఈ చిత్రాన్ని అద్భుతంగా నిర్మించారంటూ నిర్మాతగా నన్ను అభినందించడం మరింత సంతోషంగా ఉంది. మొదటి ప్రోడక్ట్‌గా ఖర్చుకు వెనుకాడకుండా విలువలతో కూడిన సినిమాను నిర్మించి, ప్రేక్షకుల మెప్పు పొందడం గర్వంగా, మరింత ప్రోత్సాహకరంగా ఉంది’ అని తెలిపారు.