లయన్ సహార నిజామాబాద్ ఆధ్వర్యంలో మోపాల్ మండల కేంద్రంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులకు శనివారం శీతల శివపేటికను అందజేయడం జరిగిందని జిల్లా కార్యదర్శి ఉదయ సూర్య భగవాన్ తెలిపారు. లయన్ సహారా ద్వారా మరిన్ని సేవలు అందిస్తామని లయన్ అధ్యక్షులు నరసింహారావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ధనుంజయ రెడ్డి, సింగిల్ విండోస్ చైర్మన్ రామచంద్ర గౌడ్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు అంజయ్య, కార్యదర్శి అంకం గిరి, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో గ్రంథాలయం లేదని సభ్యులు తెలపడంతో లయన్స్ తరఫున పుస్తకాలు,ఫ్యాన్లు అందజేస్తామని తెలిపారు.