లక్ష్మణ మూర్తి రతన, భ్రమరాంబిక తూటిక ప్రధాన పాత్రల్లో రైజింగ్ హాండ్స్ ప్రొడక్షన్స్ పి.పార్థసారథి, డి.నాగేంద్ర రెడ్డి, కష్ణ చంద్ర విజయబట్టు నిర్మాతలుగా డి.నాగ శశిధర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘సీతారాం సిత్రాలు’. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ శనివారం హీరో ఆకాష్ జగన్నాథ్ చేతుల మీదుగా జరిగింది. ఈ సినిమాని ఈనెల 30న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, ‘ప్రతి ఒక్కరు ఇది తమ సొంత సినిమా లాగా కష్టపడి పని చేశారు. ఈ సినిమా డిజిటల్‌గా ట్రైలర్ లాంచ్ చేసిన డైరెక్టర్ మారుతికి, రెండు పాటల్ని విడుదల చేసిన హీరో విశ్వక్‌సేన్‌కి, హీరో సందీప్ కిషన్‌కి కతజ్ఞతలు. చిన్న సినిమా అయిన సపోర్ట్ ఇస్తున్న హీరో కార్తికేయకి, ట్రైలర్ లాంచ్ చేసి మమల్ని సపోర్ట్ చేసిన ఆకాష్ జగన్నాథ్‌కి థ్యాంక్‌స. ప్రేక్షకులు అందరూ ఈ చిన్న సినిమాని ఆదరించి పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం’ అని అన్నారు.
‘కోవిడ్ టైంలో ఎక్కువ స్ట్రెస్ రిలీఫ్ ఇచ్చింది సినిమాలే. జంధ్యాల, ఈవివి, రేలంగి నరసింహారావు సినిమాలు ఎక్కువ చూశాను. మా సినిమా కూడా అలాంటి స్ట్రెస్ రిలీఫ్ సినిమానే’ అని డైరెక్టర్ డి.నాగ శశిధర్ రెడ్డి చెప్పారు.