నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బొడ్రాయి బజార్ లో గల వేదాంత భజన మందిరం నందు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పుట్టిన నక్షత్రం పునర్వసు సందర్భంగా శనవారం ప్రత్యేక అభిషేకాలు, మాస కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. మందిర ప్రధానార్చకులు ధరూరి సింగరాచార్యులు, దరూరి రాఘవాచార్యులు ఆధ్వర్యంలో శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి ఉత్సవమూర్తులకు పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన సింహాసనంపై పునర్వసు మాస కల్యాణ మహోత్సవమును కన్నుల పండుగగా శాస్త్రోతముగా కళ్యాణ తంతును నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవములో పెద్ద ఎత్తున దంపతులు, భక్తులు పాల్గొని వేడుకలను తిలకించారు. అమ్మ వారికి స్వామి వార్లకు తలంబ్రాలు పోశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు తదియ ఆరాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భజన మందిరం కార్యదర్శి నకిరకంటి రాజశేఖర్ కోశాధికారి సోమ అశోక్, కమిటీ సభ్యులు సోమ సుమన్, సోమధనుంజయ్, సోమ రవి, ఓరుగంటి శేఖర్, కొత్త వెంకన్న, నాగేశ్వరరావు, శీల శంకర్, కొత్తూరు రాజు, కొత్తూరు స్వాతి, మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.