నవతెలంగాణ – రాయపోల్
అంగరంగ వైభవంగా వేద పండితుల మధ్యన భక్తిశ్రద్ధలతో శ్రీ సీతారామ చంద్ర స్వామి కళ్యాణం మహోత్సవం గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాయపోల్ మండల పరిధిలోని రామసాగర్ గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం మహోత్సవం నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీ సీతారాములు కొలువు తీరారు. ఉదయం 8:00 ఆవాహిత దేవత పూజ, శ్రీరామ మూలమంత్ర హవనం, బలి ప్రధానం, పూర్ణాహుతి, కలశ ఉద్వాసన, ఆశీర్వచనం ఉదయం 11:00 గంటలకు ధనిష్ట నక్షత్ర యుక్త శుభ లగ్న పుష్కరాంశ సుముహూర్తమున శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం సీతారాముల కళ్యాణం వేద పండితుల మధ్య ఘనంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణాన్ని తిలకించడానికి భక్తులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు. భక్తులందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని, వారి కుటుంబాలను చల్లగా చూడాలని భక్తులు వేడుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మూడు రాత్రుల పాటు నిర్వహించే చిరుతల రామాయణం నాటకం చూడడానికి దండోప తండాలుగా వస్తుంటారని రాంసాగర్ భక్త బృందం తెలియజేయడం జరిగింది.