భువనగిరి మండలంలోని వడపర్తి గ్రామానికి చెందిన సర్వేనెంబర్ 129 1 ఎకరం 17 గుంట లో నూతన సబ్స్టేషన్ నిర్మాణం కొరకు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి భుసేకరణ చేయమని అధికారులకు ఆదేశించారు. వారి ఆదేశాల మేరకు బుధవారం భువనగిరి ఎమ్మార్వో అంజిరెడ్డి అనుమతితో భువనగిరి సర్వేయర్ కనకరావు, మాజీ సర్పంచ్ ఎలిమినేటి కృష్ణారెడ్డి స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి జగత్ యాదవ్, ఎర్ర మహేష్, ఇస్తారి, అడుగుల ఆనంద్ ,రాజు లు పాల్గొన్నారు.