లక్షలు, కోట్లు వెచ్చించి విల్లాలు, డ్యూప్లెక్స్ లాంటి గహాల్లో అందుకు తగ్గ ఫర్నిచర్ కూడా ఉండాల్సిందే. ఈ రోజుల్లో అందరి డ్రాయింగ్ రూముల్లో సోఫా తప్పనిసరి ఫర్నిచర్ అయింది. సోఫాలంటే సాధారణంగా ఇంటికి వచ్చిన అతిధులు కూర్చుని వెళ్లిపోయే అవసరమైన ఫర్నిచర్‌గా ఉండేది. కానీ నేడు సోఫా సెట్లు ఇంటి అలంకరణలో భాగం గానూ, మన జీవన శైలిని ప్రదర్శించే ఉపకరణాలు గాను తయారయ్యాయి. తాజాగా అందుబాటులోకి లెదర్, కాటన్, జెకార్డ్, సిల్క్, వెలెనిల్ మెటీరియల్ రకరకాలైన సోఫాసెట్స్ వస్తున్నాయి. ఎల్-టైప్, యు-టైవ్ సోఫాలు ఇంటిలోనే తయారు చేసుకునే అవకాశం ఉంది. సోఫా ముందు ఏదో కొంత ఖాళీ స్థలం ఉంది. కదా అని ఏదో ఒక టేబుల్ వేసేస్తే సరిపోదు. సెంటర్ టేబుల్ ఎంచుకునే విధానంలోనూ కొత్త దనం కనిపించాలి. గోడకు దగ్గరగా లేదా గోడ చివరగా సోఫాను అమర్చుకోవడంవల్ల ఆ గది విశాలంగా కనిపి స్తుంది. అలా చేయడంవల్ల మధ్యలో ఎక్కువ ఖాళీ ప్రదేశం వున్నట్లు కనిపిస్తుంది.
– ఆనంద ‘మైత్రేయ’మ్, హైదరాబాద్