శివమార్కండేయ శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను జయప్రదం చేయాలి

– ఆలయ కమిటీ ఛైర్మన్ బాసాని సూర్యప్రకాష్
నవతెలంగాణ – శాయంపేట 
మండల కేంద్రంలోని శ్రీ శివ మార్కండేయ, శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ ఏకాదశ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఈ నెల 10 నుండి 13 వరకు నిర్వహిస్తున్నామని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆలయ కమిటీ చైర్మన్ బాసాని సూర్యప్రకాష్ కోరారు. సోమవారం ఆలయ ప్రాంగణంలో బ్రహ్మోత్సవాల కరపత్రాలను ఛైర్మన్ సూర్య ప్రకాష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. శాయంపేట గ్రామం నందు శివ కేశవుల ప్రతిష్ట జరిగిన సంవత్సరంలోపు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. ఆగమ శాస్త్ర పద్ధతిని అనుసరించి కర్షనాది ప్రతిష్టాంతం ఉత్సవాంతం అను ప్రమాణం మేరకు ప్రతిష్ట జరిగి దశమ సంవత్సరాలు అవుతున్న సందర్భంలో వైశాఖ శుద్ధ తదియ శుక్రవారం ఈ నెల 10 నుండి 13 వరకు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను జయప్రదం చేయాలని కోరారు.
ఉత్సవ కార్యక్రమాలు
ఈనెల 10న అంకురార్పణ, 11న గణపతి పూజ, పుణ్యాహవాచనం, రుత్విగ్వరణం, అగ్నిస్థాపన, బేరీతాడనం, ధ్వజారోహణం, మండల దేవతాపూజనం, ఎదుర్కోలు, 12న పంచామృత అభిషేకాలు, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, పర్వత వర్ధిని సమేత శివ మార్కండేయ స్వామి కళ్యాణ మహోత్సవాలు, అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 13న షష్టి సుదర్శన హోమం, చండీ హోమం, పూర్ణాహుతి, ధ్వజవరోహణం, ఉత్సవ పరిసమాప్తి జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు బాసాని లక్ష్మీనారాయణ, సదాశివుడు, వెంకటేశ్వర్లు, వనం సదానందం, బాల్ని తిలక్ బాబు, బాసాని బాలకృష్ణ, మల్లికార్జున్, మామిడి రవి, తదితరులు పాల్గొన్నారు.